అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
పట్టపగలే ఓ ఇంట్లో దొంగలు పడిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురంలో శనివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజనాపురంలో లకావత్ బాల్య వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా...
– 8 తులాల బంగారం, వెండి ఆభరణాలు, లక్షల నగదు అపహరణ
బూర్గంపహాడ్, అక్టోబర్ 24 : పట్టపగలే ఓ ఇంట్లో దొంగలు పడిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురంలో శనివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజనాపురంలో లకావత్ బాల్య వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మధ్యాహ్నం సమయంలో కొందరు వ్యక్తులు ఆటోలో లకావత్ బాల్య ఇంటికి వెళ్లి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరించుకుపోయారు. పక్కింటి వారు సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చిన యజమాని ఇంట్లోకి వెళ్లి చూడగా తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించాడు. బీరువా తెరిచి ఉండటంతో దాచుకున్న 8 తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి ఆభరణాలు, నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ మేడా ప్రసాద్ బాధితుడి ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. ఈ సమాచారాన్ని పాల్వంచ సీఐ సతీషకు అందించగా ఆయన హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
నల్లగొండలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సంయుక్త తనిఖీలు
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

