Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
Emergency Alert | యూకే సర్కారు (UK Govt) ఎమర్జెన్సీ అలర్ట్ (Emergency Alert) జారీచేసింది. ఆ మేరకు వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, కార్చిచ్చులు, సైబర్ దాడులు (Cyber Attacks), నిత్యావసర సేవలకు అంతరాయం కలిగించే ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా సిద్ధంగా ఉండాలంటూ.. ‘బీ రెడీ (Be Ready)’ ప్రచారాన్ని మొదలుపెట్టింది.
Emergency Alert : యూకే సర్కారు (UK Govt) ఎమర్జెన్సీ అలర్ట్ (Emergency Alert) జారీచేసింది. ఆ మేరకు వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, కార్చిచ్చులు, సైబర్ దాడులు (Cyber Attacks), నిత్యావసర సేవలకు అంతరాయం కలిగించే ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా సిద్ధంగా ఉండాలంటూ.. ‘బీ రెడీ (Be Ready)’ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఆహారం, నీరు, విద్యుత్, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలకు అంతరాయం కలిగితే కనీసం మూడురోజులు తట్టుకునేలా అవసరమైన సామగ్రిని ఇంట్లో ఉంచుకోవాలని ఆండీ బర్న్‌హామ్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది.
తాగునీరు, ఆహార పదార్థాలు, విద్యుత్, ఇంటర్నెట్ లేనప్పుడు వార్తలు తెలుసుకోవడానికి రేడియో, డిజిటల్ పేమెంట్లు చేయలేని పరిస్థితుల్లో వాడుకోవడానికి కొంత నగదు, టార్చిలైట్లు, బ్యాటరీలు, దుప్పట్లు వంటి వాటిని అందుబాటులో ఉంచుకోవాలని యూకే ప్రభుత్వం సూచించింది. బీ రెడీ వెబ్సైట్లో నిత్యావసరాల జాబితాను షేర్ చేసింది. ప్రజలు ఒకేసారి మార్కెట్లలో వస్తువులను కొనేయాల్సిన పనిలేదని, ప్రతివారం షాపింగ్‌కు వెళ్లినప్పుడు కొద్దికొద్దిగా వస్తువులను సమకూర్చుకోవాలని సూచించింది. ప్రస్తుతం యూరప్ వ్యాప్తంగా ప్రజలు నిరసనలను కొనసాగిస్తున్న తరుణంలో ఈ ప్రచారాన్ని చేపట్టడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
నల్లగొండలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సంయుక్త తనిఖీలు
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Jamia Millia Islamia | ఎన్నికల కోసం జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన.. భద్రతా సిబ్బందితో ఘర్షణ
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

