నిన్నటివరకు ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ విషయంలో అనేక అనుమానాలు తలెత్తాయి. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ట్రిపుల్ ఆర్ సినిమా అక్టోబర్ 13న విడుదల కావడం కష్టమేనని వార్తలు వినిపించాయి. ఇందులో నటిస్తోన్న ఆలియా భట్ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని గుసగుసలు వినిపించాయి. అందుకే 2022 సంక్రాంతి బరిలో దిగుతోందని టాక్ వచ్చింది. అయితే ఈ వార్తలన్నింటికి ఒక్క పోస్టర్ తో సమాధానమిచ్చాడు దర్శకుడు రాజమౌళి.
సరిగమ సినిమాస్, రఫ్టార్ క్రియేషన్స్ సంయుక్తంగా USA థియేటరికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నాయని చెబుతూ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అంతేకాదు అక్టోబర్ 12న USA లో RRR సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని క్లారిటీ ఇచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటిస్తోన్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమా ఇప్పటికే భారీ బిజినెస్ జరుపుకున్నట్లు వార్తలు వచ్చాయి. బాలీవుడ్ నటుడు అజయ్‌దేవ్‌గన్, శ్రియ, కోలీవుడ్ యాక్టర్ సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
.@sarigamacinemas & @RaftarCreations acquired the USA theatrical rights of India's biggest multistarrer #RRRMovie 🔥🌊
— BA Raju's Team (@baraju_SuperHit) April 7, 2021
USA Premiers On October 12th@SSRajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies #RRR pic.twitter.com/3STRzOipGO
ఇవి కూడా చదవండి
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్