కరోనా దెబ్బకు సినిమాల విడుదల తేదీలు అన్నీ మారిపోయాయి. ఏకంగా మార్చ్ నుంచి మొదలు పెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి వరకు సినిమాలను విడుదల చేయాలని ముందుగానే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసారు నిర్మాతలు.
రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా గురించి దేశం అంతా ఆసక్తిగా వేచి చూస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలకు సంబంధించిన స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
నిన్నటివరకు ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ విషయంలో అనేక అనుమానాలు తలెత్తాయి. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ట్రిపుల్ ఆర్ సినిమా అక్టోబర్ 13న విడుదల కావడం కష్టమేనని వార్తలు వినిపించాయి.