పోలీసుల ఓవరాక్షన్
ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన తాండూరు పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మణికొండలోని నివాసానికెళ్లారు.
- ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు మణికొండలోని ఇంటికెళ్లిన తాండూరు పోలీసులు
- ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో.. తనిఖీల పేరిట రెండు గంటలపాటు హంగామా
- బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి
- తాండూరు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి
తాండూరు, ఫిబ్రవరి 15 : ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన తాండూరు పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మణికొండలోని నివాసానికెళ్లారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే లేకపోవడంతో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఆ ఇంట్లో రెండు గంటలపాటు తనిఖీల పేరిట నానా హంగామా చేశా రు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు రోహిత్‌రెడ్డి ఇం టిని తనిఖీ చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని తాండూరు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, సీనియర్ నాయకుడు రాజూగౌడ్ డిమాండ్ చేశారు. ఆదివా రం రాత్రి 8 గంటలకు వారు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని పోలీసు లు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితోపాటు ఏడుగురిపై తాం డూరు పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లోనూ.. ఓట్ల లెక్కింపులోనూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా 23వ వార్డు పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో చొరబడేందుకు యత్నించినా పోలీసులు కేసు పెట్టలేదన్నారు.
తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో ముందుగా ప్రకటించిన 24 వార్డుల ఫలితాల్లో బీఆర్ఎస్కు ఆధిక్యత వచ్చిన సమయంలో మరో ఐదు వార్డులకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుండగానే ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, పురుషోత్తం, స్వప్న, రవిగౌడ్ కౌంటింగ్ కేంద్రంలోకెళ్లినా పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతించారని.. వారి తప్పులు పోలీసులకు కనిపించవా అని ప్రశ్నించారు. పోలీసులు అక్రమ కేసులను వెం టనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల అక్రమాలపై జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ విషయంలో న్యా యం జరుగకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని శ్రీశైల్‌రెడ్డి హెచ్చరించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

