Ring of Fire | ఈ నెల 17 ఆకాశంలో అద్భుతం.. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ఆవిష్కృతం
Ring of Fire | ఈ నెల 17న ఆకాశంలో ఓ అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. ఆ రోజు వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీన్ని 'రింగ్ ఆఫ్ ఫైర్ (అగ్ని వలయం)’ అని పిలుస్తారు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఆకాశంలో అద్భుతంగా కనిపించనుంది.
Ring of Fire : ఈ నెల 17న ఆకాశంలో ఓ అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. ఆ రోజు వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీన్ని ‘రింగ్ ఆఫ్ ఫైర్ (అగ్ని వలయం)’ అని పిలుస్తారు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఆకాశంలో అద్భుతంగా కనిపించనుంది. అయితే ఈ అరుదైన ఖగోళ అద్భుతాన్ని భారతదేశంలో వీక్షించే అవకాశం లేదు. ఇది ప్రధానంగా దక్షిణార్ధ గోళంలో, అదీ అత్యంత మారుమూల ప్రాంతంలో మాత్రమే సంపూర్ణంగా కనిపించనుంది.
సాధారణంగా సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణం సమయంలో చంద్రుడు తన సాధారణ పరిమాణం కంటే కొంచెం చిన్నగా కనిపించడంవల్ల సూర్యుడిని పూర్తిగా కప్పలేడు. సూర్యుడి మధ్య భాగాన్ని కేవలం 96 శాతం మాత్రమే అడ్డుకుంటాడు. దాంతో సూర్యుడి అంచులు ఒక ప్రకాశవంతమైన బంగారు వలయంలా కనిపిస్తాయి. దీన్నే కంకణాకార గ్రహణం లేదా ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటారు.
ఈ అగ్ని వలయం గరిష్టంగా 2 నిమిషాల 20 సెకన్ల పాటు కనువిందు చేయనుంది. UTC కాలమానం ప్రకారం ఫిబ్రవరి 17న ఉదయం 07:01 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. ఈ సంపూర్ణ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ గ్రహణం అంటార్కిటికా ఖండంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి కాంకార్డియా, మిర్నీ వంటి పరిశోధనా కేంద్రాల్లో ఉన్న శాస్త్రవేత్తలు, సిబ్బంది మాత్రమే ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడగలరు. ఆ ప్రాంతాలు సాధారణ పర్యాటకులకు అందుబాటులో ఉండవు.
అయితే, దక్షిణాఫ్రికా, టాంజానియా, జింబాబ్వే వంటి ఆఫ్రికా దేశాలతోపాటు అర్జెంటీనా, చిలీ వంటి దక్షిణ అమెరికా దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం సంభవించే సమయంలో సూర్యుడు దిగంతం కింద ఉంటాడు. కాబట్టి ఇక్కడ పాక్షికంగా కూడా గ్రహణాన్ని చూసే అవకాశం లేదు. అయితే నాసా (NASA) వంటి అంతరిక్ష సంస్థలు ప్రసారం చేసే ఆన్లైన్ లైవ్ స్ట్రీమ్‌ల ద్వారా భారతీయులు ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చు.
గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూసేవారు తప్పనిసరిగా ప్రత్యేకమైన సోలార్ ఫిల్టర్ కళ్లద్దాలు వాడాలి. నేరుగా చూడటం కళ్లకు తీవ్ర హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

