లండన్: రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీని ఆ దేశంలోని పుతిన్ ప్రభుత్వం కప్ప విషమిచ్చి చంపిందని యూకే సహా నాలుగు యూరోపియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. బహుళ నిఘా సంస్థలతో చేపట్టిన దర్యాప్తులో ఈ విషయం తేలిందని యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ తాజాగా ప్రకటించాయి.
రష్యాలోని మారుమూల ఆర్కిటిక్ శిక్షా కాలనీలో పుతిన్ ప్రభుత్వం అతడ్ని బంధించగా, 2024 ఫిబ్రవరిలో నావల్నీ జైల్లోనే మరణించాడు.
అతడ్ని ఖననం చేయడానికి ముందు అతడి శరీరం నుంచి నమూనాలను సేకరించి రెండు దేశాల ప్రయోగశాలలకు పంపారు. రసాయన ఆయుధాల్ని ప్రయోగించటం ద్వారా రష్యా ‘కెమికల్ వెపన్స్ కన్వెన్షన్’ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపించాయి. క్వెడార్ డార్ట్ కప్పల చర్మంలో ప్రాణాంతక విషం నావల్నీ శరీరంలో కనిపించిందని నిఘా సంస్థలు చెబుతున్నాయి.