Irumudi | మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ‘నిన్ను కోరి’, ‘టక్ జగదీష్’ వంటి చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.ఇప్పటివరకు సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకున్నాయి. ముఖ్యంగా కుటుంబ కథాంశానికి భక్తి అంశాలను జోడించి సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తుండటంతో ‘ఇరుముడి’పై అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై బజ్ క్రియేట్ చేసిన మేకర్స్.. ఇప్పుడు అతిపెద్ద ప్రమోషనల్ అప్డేట్కు సిద్ధమయ్యారు. అదే ‘ఇరుముడి’ థియేట్రికల్ ట్రైలర్. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 12న ‘ఇరుముడి’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. భీమవరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు అభిమానులు, సినీ ప్రేక్షకులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ‘ఇరుముడి’ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను తీసుకొచ్చింది. దీంతో ట్రైలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ భావోద్వేగాలు, భక్తి అంశాలతో పాటు రవితేజకు సంబంధించిన మాస్ ఎలివేషన్స్‌ను ట్రైలర్లో ఎలా చూపించారనేది ఆసక్తికరంగా మారింది.
ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తే సినిమా విడుదలకు ముందే హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రవితేజను శివ నిర్వాణ ఏ తరహా పాత్రలో చూపించారనే విషయం ట్రైలర్ ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర కనిపించనుంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉన్న కథలో ఈ తండ్రీకూతుళ్ల బంధం కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.మాస్ మహారాజా ఇమేజ్‌కు భిన్నంగా కుటుంబ భావోద్వేగాలను, భక్తి అంశాలను కలగలిపి శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీంతో ‘ఇరుముడి’ రవితేజ కెరీర్లో మరో విభిన్నమైన సినిమాగా నిలుస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. కాగా ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్‌కు కేవలం కొద్ది రోజుల ముందు ఆగస్టు 12న ట్రైలర్‌ను విడుదల చేయడం ద్వారా ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.