తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేనియా నడుస్తుంది. ఈయన నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. దాంతో అభిమానుల హంగామా మొదలైపోయింది. మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కరోనాను కూడా పట్టించుకోవడం లేదు వాళ్లు. వకీల్ సాబ్ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత ఇండస్ట్రీ అంతా షాక్ అయిపోతుంది. వామ్మో పవన్ రేంజ్ ఇలా ఉంటుందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. కరోనా తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యాక పూర్తి స్థాయిలో విడుదలవుతున్న తొలి తెలుగు భారీ సినిమా ఇదే. ఇప్పటి వరకు క్రాక్, ఉప్పెన, జాతి రత్నాలు లాంటి సంచలన విజయాలు వచ్చాయి కానీ థియేటర్స్‌కు జాతర తీసుకొచ్చే హీరో మాత్రం ఇప్పటి వరకు రాలేదు.
ఇప్పుడు పవన్ వస్తున్నాడు.. దాంతో థియేటర్స్ దగ్గర జాతర కనిపించడం ఖాయం. మొన్న విడుదలైన ట్రైలర్ 24 గంటల్లోనే 18 మినిలియన్లకు పైగా వ్యూస్.. 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా ఎన్నడూ చూడని రికార్డులు ఇవి. దాంతో రిలీజ్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు విడుదలయ్యే తీరు చూసిన తర్వాత రికార్డులు ఏవైనా మిగులుతాయా అనేది కూడా అనుమానమే. ఈ సినిమాను ఏప్రిల్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2000 థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నారు. దాంతో పాటు విదేశాల్లో 700 స్క్రీన్స్ లో విడుదల కాబోతుంది. కరోనా తర్వాత ఇంత భారీగా విడుదలవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే.
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే హాట్ కేక్స్ మాదిరి అయిపోయాయి. వకీల్ సాబ్ ఫస్ట్ డే టికెట్స్ గంటలోపే హాట్ కేకులకు బాబులా అయిపోయాయి. హైదరాబాద్‌లో దాదాపు 94 శాతం థియేటర్లలో టిక్కెట్లన్నీ బుక్కయిపోయాయని తెలుస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో ఓపెన్ చేసిన గంటల్లోనే అయిపోయాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమాకూ ఇలా టిక్కెట్లు బుక్ కాలేదని అంటున్నారు. ఏడాది తర్వాత నిఖార్సైన స్టార్ సినిమా వస్తుండటంతో ఈ ఫీవర్ కనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి