SRH vs PBKS : పంజాబ్ గడ్డ మీద సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ(74) శివాలెత్తిపోయాడు. సిక్సర్ల మోతతో పంజాబ్ కింగ్స్ బౌలర్లను బెంబేలెత్తించిన అభిషేక్ అర్ధ శతకంతో అదిరే ఆరంభమిచ్చాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్(38)సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో పవర్ ప్లోలోనే స్కోర్ 100 పరుగులు దాటింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ ద్వయాన్ని ఎట్టకేలకు శశాంక్ సింగ్(2-20) విడదీశాడు.
ముల్లన్‌పూర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు దుమ్మురేపారు. పంజాబ్ కింగ్స్ బౌలర్ల భరతం పడుతూ అభిషేక్ శర్మ(74), ట్రావిస్ హెడ్(38)లు బౌండరీల మోత మోగించారు. వీరిద్దరి ఊచకోతతో ఆరు ఓవర్లకే స్కోర్ వంద దాటింది. ఈ జోడీని విడదీసేందుకు శశాంక్ సింగ్(2-20) చేతికి బంతి ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఫలితం సాధించాడు.
𝗕𝗿𝗲𝗮𝘁𝗵𝘁𝗮𝗸𝗶𝗻𝗴 💥
That’s how Abhishek Sharma celebrated his 🔟th #TATAIPL FIFTY 👏👏@SunRisers 105/0 after the powerplay
Updates ▶️ https://t.co/DUNkQi9YaV#KhelBindaas | #PBKSvSRH | @OfficialAbhi04 pic.twitter.com/1c758V3tR5
— IndianPremierLeague (@IPL) April 11, 2026
శశాంక్ వేసిన 9వ ఓవర్లో హెడ్, అభిషేక్ ఔటయ్యారు. తొలి బంతికి బార్ట్లెట్కు హెడ్ దొరికిపోగా.. ఎక్స్ట్రా కవర్స్ దిశగా సిక్సర్‌కు యత్నించిన అభిషేక్ బౌండరీ వద్ద అర్ష్‌దీప్ సింగ్ చేతికి చిక్కాడు. దాంతో.. 122 వద్ద సన్‌రైజర్స్ రెండు బిగ్ వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం హెన్రిచ్ క్లాసెన్(16 నాటౌట్), కెప్టెన్ ఇషాన్ కిషన్(20 నాటౌట్)లు ఆడుతున్నారు. 13 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 160-2.