Ailapur Victims | అసలు గెలిచింది ఎందుకు.. ఇండ్లు కూలగొట్టనీకి గెలిపించినమా..? అని ఐలాపూర్ గ్రామంలో హైడ్రా కూల్చివేత బాధిత మహిళ ప్రశ్నించింది. రేవంత్ సర్కార్ దౌర్జన్యంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ .. తీవ్ర స్థాయిలో విరుచుకపడింది. చిన్న చిన్న పిల్లలున్నరు.. ఈ పిల్లలను తీసుకొని ఎక్కడికి పోవాలే. మీకు తులం బంగారం ఇస్తం.. మీ బిడ్డలకు పెళ్లిళ్లు చేస్తం.. మీకు సాయం చేస్తం. మీ ఆడబిడ్డలకు అండగా ఉంటామని చెప్పి అన్ని ఓట్లేయించుకుని గెలిచినవ్. ఇప్పుడు ఉన్న ఇల్లు కూలగొడితే మేము ఏడుండాలే.. మా పరిస్థితి ఏందని ప్రశ్నించింది.
ఆడబిడ్డలకు అండగా ఉంటానని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచి.. ఇప్పుడు ఉన్న ఇళ్ల కూలగొడితే మేము ఎక్కడికి పోవాలని ప్రశ్నించింది. నేనిక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ అస్సలు ఇబ్బంది పెట్టలేదు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి ఈ ఇబ్బందులు అవుతున్నాయి. ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్‌స్టాప్‌ల దగ్గర పండుకుంటున్నరు. వాళ్ల ఉసురు ముట్టదా..? అసలు రీతేనా.. వానిది బతుకేనా.. వాడొక్కటే బాగుంటే కాదు.. ఇతరుల బతుకేందో చూపియ్యాలే. తెలివున్నోడు, ధైర్యమున్నోడైతే ఈ ఊర్లోకొచ్చి మాట్లాడుమను.
మహిళలకు రూ.2500 నెలకు ఇస్తమన్న ఎటు పోయినయి. వాని మొఖమేంది.. రోడ్లమీద తిరిగేందుకు జుట్లు పట్టుకొని కొట్టుకోవడానికి బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు. కష్టం చేసి బతుకనీకి మేం పెట్టుమన్నమా..? పైసలు తీసుకోరా.. ఇన్ని రోజుల దాకా మేం తిరగలేమా..? పోలేమా.. పెట్టుకోలేమా.. ఎవరమన్నా పెట్టుమన్నం. దరిద్రం మొఖపోడు. ఇంక ఐదేళ్లు ఏముంటడు.. వాణ్ణి ఎడమ కాలు చెప్పు తీసుకొని కొడ్తరు. మళ్లి ఓట్ల కోసం వస్తే చెప్పు తీసుకొని కొడతా.ఈ ఊళ్లెకు రానీకి మొఖముంటదా.. వాడికి అంటూ బాధిత మహిళ ఆగ్రహంతో ఊగిపోయింది.
ఆడబిడ్డలకు అండగా ఉంటానని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచి.. ఇప్పుడు ఉన్న ఇళ్ల కూలగొడితే మేము ఎక్కడికి పోవాలి
కేసీఆర్ మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు.. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతే ఇలాంటి కథల్ పడుతున్నాడు
రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి
ఇంకోసారి… https://t.co/fpffvOg48F pic.twitter.com/XWGGjUTJV2
— Telugu Scribe (@TeluguScribe) April 11, 2026