Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో అమర్చిన మైన్లను గుర్తించలేకపోతున్న ఇరాన్
Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. యుద్ధంలో భాగంగా శత్రవులను ఎదుర్కొనేందుకు హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్లను అమర్చిన విషయం తెలిసిందే. అయితే ఆ మైన్లను ఎక్కడ, ఎంత లోతులో అమర్చిందో ఇరాన్ గుర్తించలేకపోతున్నట్లు అమెరికా వర్గాలు చెబుతున్నాయి.
వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధి(Strait of Hormuz)లో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. యుద్ధంలో భాగంగా శత్రవులను ఎదుర్కొనేందుకు హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సముద్ర నీటిలో వాటిని ఇరాన్ ప్లేస్ చేసింది. అయితే ప్రస్తుతం చమురు నౌకలకు రూట్‌ను క్లియర్ చేసేందుకు ఇరాన్ ఇబ్బందిపడుతోంది. జలసంధిలో ఎక్కడ, ఎంత లోతులో మైన్లను అమర్చిందో ఇరాన్ గుర్తించలేకపోతున్నట్లు అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఆ మైన్లను గుర్తించి, వాటిని తొలగించే ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. జలసంధి మార్గంలో ఇరాన్ చాలా నిర్లక్ష్యంగా మైన్లను నాటిందని, దీని వల్ల సురక్షితమైన మార్గం ఏంటో తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు.
ఇస్లామిక్ రెవల్యూషనరి గార్డ్ కార్ప్స్ కేర్లెస్గా ఆ మైన్లను పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాటికల్ మైన్లను తొలగించే సామర్థ్యం ఇరాన్ వద్ద కానీ, అమెరికా వద్ద కానీ లేనట్లు ఓ రిపోర్టులో తెలిపారు. కొన్ని ల్యాండ్మైన్లు సముద్ర నీటిలో స్థలం మారే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పారు. జలసంధి మార్గంలో ఎక్కడెక్కడ మైన్లను అమర్చిన విషయాన్ని ఇరాన్ డాక్యుమెంట్ చేసిందా లేదా అన్న విషయం కూడా స్పష్టంగా తెలియడం లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు.
బుధవారమే జలసంధిని ఓపెన్ చేశారని, టోల్ ఫీజు వసూల్ చేస్తోందని అమెరికా ఆరోపించింది. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు హోర్ముజ్‌లో ట్రాఫిక్ని ఆపేస్తామని ఇరాన్ పేర్కొన్నది. హోర్ముజ్ జలసంధిలో సుమారు 3200 వెసల్స్ చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. దీంట్లో 800 భారీ నౌకలు ఉన్నాయి.అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలకు చెందిన నౌకలను పేల్చేందుకు హోర్ముజ్ జలసంధిలో అండర్ వాటర్ మైన్లను ఇరాన్ అమర్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

