Youth OTT | తమిళంలో ఘనవిజయం సాధించి, తెలుగులోనూ మంచి ఆదరణ పొందిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘యూత్’ (Youth) ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా… ఈ చిత్రం ఏప్రిల్ 16, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కెన్ కరుణాస్ ఈ చిత్రంలో కథనాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించగా.. అనీషా అనిల్ కుమార్, మీనాక్షి దినేష్, ప్రియాన్షీ యాదవ్, సూరజ్ వెంజరమూడు, దేవదర్శిని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మార్చి 19న తమిళంలో, మార్చి 27న తెలుగులో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది ఈ చిత్రం.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక మధ్యతరగతి టీనేజర్ తన స్కూల్, కాలేజ్ రోజుల్లో ప్రేమ కోసం చేసే ప్రయత్నాలు, ఎదుర్కొన్న అవమానాలు మరియు బ్రేకప్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక యువకుడు తన జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాల నుండి ఎలా పరిణతి చెందాడు అనే అంశాన్ని దర్శకుడు వినోదాత్మకంగా, భావోద్వేగపూరితంగా తెరకెక్కించారు.
Ada ennada ithu kaadhaluku vandha sodhanai? 🤭💔 pic.twitter.com/gJHkSEqa9N
— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026