Viral news | చిన్నారి గొంతులో దూరిన ఎక్వేరియం చేప.. తర్వాత ఏం జరిగిందంటే..!
Viral news | ఎక్వేరియం (Aquarium) లోని చేప చిన్నారి గొంతులో దూరడంతో ఆ చిన్నారి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు చికిత్స చేసి తొలగించారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని ఇండోర్ నగరం (Indore city) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Viral news : ఎక్వేరియం (Aquarium) లోని చేప చిన్నారి గొంతులో దూరడంతో ఆ చిన్నారి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు చికిత్స చేసి తొలగించారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని ఇండోర్ నగరం (Indore city) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది.
ఇండోర్‌లో ఓ మహిళ తన ఇంట్లోని ఎక్వేరియం శుభ్రం చేసేందుకు అందులోని చేపలను ఓ జాలిలో వేసింది. ఆమె ఎక్వేరియం శుభ్రం చేస్తుండగా.. ఆమె ఏడాది కొడుకు చేపలను చూస్తూ కేరింతలు కొడుతున్నాడు. అదే సమయంలో ఓ చేప పైకి ఎగిరి నోరు తెరిచి నవ్వుతున్న బాలుడి నోట్లోకి దూరింది. దాంతో ఆ బాలుడికి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి చేపను తొలగించారు. ఈఎన్టీ విభాగం అధిపతి డాక్టర్ యామినీ గుప్తా ఆధ్వర్యంలోని వైద్యబృందం అత్యవసర శస్త్రచికిత్స చేసింది. ‘బాలుడి గొంతులో చిక్కిన మూడు అంగుళాల చేప బలంగా కొట్టుకుంటోంది. దాంతో బాలుడికి గాయమై లాలజలంతోపాటు రక్తం బయటకు వచ్చింది. చేపను తొలగించాక వైద్యులు బాలుడిని ఒకరోజు తమ పర్యవేక్షణలో ఉంచుకుని డిశ్చార్జి చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

