MLA Nayini | నేటి జీవనశైలిలో శారీరక వ్యాయామం ఎంతో అవసరం : ఎమ్మెల్యే నాయిని
MLA Nayini | వరంగల్ డిస్ట్రిక్ టెన్నిస్ అసోసియేషన్(డబ్ల్యూడీటీఏ) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూడీటీఏ-2026 ఇంటర్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్స్ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.
హనుమకొండ చౌరస్తా : వరంగల్ డిస్ట్రిక్ టెన్నిస్ అసోసియేషన్(డబ్ల్యూడీటీఏ) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూడీటీఏ-2026 ఇంటర్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్స్ ( Tennis tourney ) ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రెండురోజుల పోటీలను శనివారం హనుమకొండలోని ఆఫీసర్స్ క్లబ్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ( MLA Nayini Rajendar Reddy ) పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి జీవనశైలిలో శారీరక వ్యాయామం ఎంతో ముఖ్యమన్నారు. నిరంతర క్రీడలు యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. డబ్ల్యూడీటీఏ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరెడ్డి ( Gandra Satyanarayana Reddy ) మాట్లాడుతూ క్రీడలు జీవితంలో అవిభాజ్యభాగంగా ఉండాలని, ప్రాథమిక విద్య నుంచి గ్రాడ్యుయేషన్ వరకు క్రీడలను తప్పనిసరి చేయాలని సూచించారు.
ఈ టోర్నమెంట్లో మొత్తం 90 జట్లు పాల్గొన్నట్లు వివరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏసీపీ నరసింహరావు, మురుగన్, కన్నారెడ్డి, టి.బాబురెడ్డి, కమల్, డాక్టర్ జయసింహరెడ్డి, రవీంద్రనాథ్, ప్రభాకర్‌రావు, వీఎస్ రెడ్డి, జి.రవీందర్, దుర్గాప్రసాద్, శరత్, డాక్టర్ ప్రవీణ్ (డెంటల్), తెలుగు రామకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

