Pooja Hegde | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు ముందే పైరసీ బారిన పడటం సినీ పరిశ్రమను తీవ్రంగా కలవరపెడుతోంది. థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా అనూహ్యంగా ఆన్లైన్లో హెచ్డీ ప్రింట్ల రూపంలో లీక్ కావడంతో మేకర్స్‌తో పాటు అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై హీరోయిన్ పూజా హెగ్డే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పందిస్తూ.. ఒక సినిమా అనేది అనేక మంది శ్రమ, త్యాగాల ఫలితం. మా సినిమా ఇలా లీక్ కావడం ఎంతో బాధాకరం. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి” అంటూ భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు థియేటర్లలోనే సినిమాను చూసి ప్రోత్సహించాలని కోరారు.
ఇదిలా ఉండగా, ఈ సినిమా రిలీజ్ ముందే సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. సీబీఎఫ్సీ కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సర్టిఫికేషన్ ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ కోర్టును ఆశ్రయించగా, కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో సినిమా లీక్ కావడం యూనిట్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ ఘటనపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందిస్తూ, పైరసీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఇది “కళపై జరిగిన దాడి” అని వ్యాఖ్యానించారు.
శనివారం (ఏప్రిల్ 11) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పూజా హెగ్డే భావోద్వేగంతో స్పందించింది. ..ప్రియమైన ప్రేక్షకులారా.. ఒక సినిమా అంటే అనేక గంటల శ్రమ, సృజనాత్మక ప్రయోగాలు, వ్యక్తిగత త్యాగాల సమ్మేళనం. మీకు ఉత్తమ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఒక పెద్ద టీమ్ ప్రతిరోజూ కష్టపడుతుంది. అలాంటి మా సినిమా ముందుగానే ఆన్లైన్లో లీక్ కావడం నాకు మాత్రమే కాదు, ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఎంతో బాధ కలిగిస్తోంది” అని ఆమె తెలిపింది. ఇక పైరసీపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇలా చట్టవిరుద్ధంగా సినిమాలు లీక్ కావడం వల్ల కేవలం వసూళ్లే కాదు, కళాకారులు, సాంకేతిక నిపుణులు అందరూ ఆశించే గౌరవం దెబ్బతింటుంది. విజయ్ గారి చివరి చిత్రాన్ని అందరం కలిసి థియేటర్లలో పెద్ద తెరపై చూసి ఆనందించడం మన బాధ్యత. కాబట్టి దయచేసి సినిమాను సరైన మార్గంలోనే చూడండి. కొంచెం వేచి ఉండండి, అది సరైన సమయంలో విడుదల అవుతుంది. పైరసీని ప్రోత్సహించకండి.. అప్పుడు మాత్రమే సినిమా, కళ నిలుస్తాయి అని విజ్ఞప్తి చేసింది.