Watch: న్యాయవాదిని కాల్చి చంపిన దుండగులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Lawyer Shot Dead | బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక న్యాయవాదిని కాల్చి చంపారు. ఆ తర్వాత బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఆ బైక్ కొంతసేపు స్టార్ట్ కాలేదు. స్థానికులు సమీపిస్తుండటంతో ఆ హంతకులు ఆందోళన చెందారు. చివరకు బైక్ స్టార్ట్ కావడంతో వారిద్దరూ పారిపోయారు.
లక్నో: బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక న్యాయవాదిని కాల్చి చంపారు. ఆ తర్వాత బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఆ బైక్ కొంతసేపు స్టార్ట్ కాలేదు. స్థానికులు సమీపిస్తుండటంతో ఆ హంతకులు ఆందోళన చెందారు. చివరకు బైక్ స్టార్ట్ కావడంతో వారిద్దరూ పారిపోయారు. (Lawyer Shot Dead) ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. బైక్ దిగిన ఒక వ్యక్తి మార్నింగ్ వాక్ చేస్తున్న 45 ఏళ్ల సీనియర్ న్యాయవాది రాజీవ్ సింగ్ వద్దకు వెళ్లాడు. చేతిలోని నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాల వల్ల ఆ న్యాయవాది అక్కడికక్కడే మరణించారు.
కాగా, న్యాయవాది రాజీవ్ సింగ్‌ను కాల్చి చంపిన తర్వాత ఇద్దరు హంతకులు బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించారు. బైక్‌పై కూర్చొన్న వ్యక్తి దానిని స్టార్ట్ చేసేందుకు పలుమార్లు కిక్ చేశాడు. అయినప్పటికీ బైక్ స్టార్ కాలేదు. ఇంతలో స్థానికులు వారిని సమీపించసాగారు. ఇది చూసి ఆ హంతకులు ఆందోళన చెందారు.
మరోవైపు కాల్పులు జరిపిన వ్యక్తి ఆ బైక్ కిక్ కొట్టేందుకు ప్రయత్నించగా మరో వ్యక్తి గన్ చూపించి స్థానికులను బెదిరించాడు. చివరకు ఆ బైక్ స్టార్ట్ కావడంతో వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.
అయితే మాజీ గ్రామ సర్పంచ్ అయిన న్యాయవాది రాజీవ్ సింగ్‌పై గతంలో కూడా రెండుసార్లు దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో తనపై మళ్లీ దాడి జరగవచ్చని ఆందోళన చెందిన ఆయన ప్రాణ రక్షణ కోసం పోలీసులకు దరఖాస్తు సమర్పించినట్లు తెలుస్తున్నది.
కాగా, న్యాయవాది రాజీవ్ సింగ్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. హంతకుల బైక్ కొంతసేపు మొరాయించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
📍Mirzapur, Uttar Pradesh: This is not a scene from the web series Mirzapur, but a real law-and-order situation unfolding in Uttar Pradesh. Advocate Rajeev Kumar Singh was shot in the morning in a shocking incident that has raised serious concerns over law and order. pic.twitter.com/8uOmcaeFcp
— Deadly Kalesh (@Deadlykalesh) April 11, 2026
Also Read:
Woman killed in PG | పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో మహిళ హత్య.. బెడ్ బాక్స్‌లో మృతదేహం
Boy Killed In Bee Attack | పరీక్షకు హాజరైన విద్యార్థులు.. తేనెటీగల దాడి, బాలుడు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

