Woman killed in PG | పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో మహిళ హత్య.. బెడ్ బాక్స్‌లో మృతదేహం
Woman killed in PG | పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో ఒక మహిళ హత్యకు గురైంది. గదిలోని బెడ్ బాక్స్‌లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మహిళను కట్టేసి ఊపిరాడకుండా చేసి, గొంతు నులిమి చంపినట్లు అనుమానించారు. ప్రియుడైన యువకుడితో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో ఒక మహిళ హత్యకు గురైంది. గదిలోని బెడ్ బాక్స్‌లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మహిళను కట్టేసి ఊపిరాడకుండా చేసి, గొంతు నులిమి చంపినట్లు అనుమానించారు. ప్రియుడైన యువకుడితో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. (Woman killed in PG) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 7న సాయంత్రం 4.30 గంటల సమయంలో మంగోల్‌పురి ప్రాంతంలోని పేయింగ్ గెస్ట్ వసతి గృహానికి 35 ఏళ్ల మహిళ, 22 ఏళ్ల యువకుడు వచ్చారు.
కాగా, గంట తర్వాత ప్రియుడైన అతడు ఒంటరిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడితో కలిసి వచ్చిన మహిళ కనిపించకపోవడంతో గెస్ట్ హౌస్ యజమాని అనుమానించాడు. ఆ రూమ్‌ను సిబ్బంది తనిఖీ చేయగా బెడ్ బాక్స్‌లో మహిళ మృతదేహం కనిపించింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మహిళ చేతులు, కాళ్లు కట్టివేసి ఉండటాన్ని గమనించారు. ఆమె గొంతు నులిమిన గుర్తులు, నుదుటిపై గాయం ఉన్నాయి. దీంతో ఆ మహిళను కట్టేసి గొంతునొక్కి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
కాగా, మహిళ హత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఆ ప్రాంతానికి చెందిన నిందితుడైన 22 ఏళ్ల ప్రియుడు దీపక్, అతడి స్నేహితులైన సురేందర్ అలియాస్ బాబీ, జోగిందర్‌ను అరెస్ట్ చేశారు. ఆ మహిళను ఎందుకు హత్య చేశారు అన్నది వారిని ప్రశ్నిస్తున్నారు. అలాగే హత్యకు ముందు ఆమెపై లైంగిక దాడి జరిగిందా లేదా అన్నది పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా నిర్ధారణ అవుతుందని పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Man Beheads Driver, Mob Kills Him | డ్రైవర్ తల నరికిన వ్యక్తి.. అతడ్ని కొట్టి చంపిన స్థానికులు
coercion at Nashik firm | ఎంఎన్సీ కంపెనీలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు.. ఆరుగురు అరెస్ట్
boat capsizes in Vrindavan | యమునా నదిలో పడవ బోల్తా.. పది మంది మృతి, పలువురు గల్లంతు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

