ముంబై: మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులపై కొన్నేళ్లుగా లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. ఆ సంస్థ ఉన్నతాధికారుల, సహోద్యోగులు వారిని లైంగికంగా, మానసికంగా, మతం పేరుతో వేధించడంతోపాటు కొందరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. (coercion at Nashik firm) బాధిత మహిళల ఫిర్యాదులపై పోలీసులు స్పందించారు. ఆ సంస్థకు చెందిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ సంఘటన జరిగింది. బహుళజాతి కంపెనీ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా సిబ్బందిని పలు విధాలుగా వేధిస్తున్న కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
కాగా, గత నాలుగేళ్లుగా తాము లైంగిక, మానసిక వేధింపులతోపాటు, మతరపరంగా, వ్యక్తిగతంగా దూషణలు ఎదుర్కొన్నట్లు నాసిక్‌లోని ఆ ఎంఎన్సీలో పని చేసే పలువురు మహిళా ఉద్యోగులు ఆరోపించారు. మత మార్పడికి బలవంతం చేశారని, బలవంతంగా మాంసాహారం తినిపించారని కొందరు, ఒక సహోద్యోగి పెళ్లి పేరుతో లోబర్చుకుని అత్యాచారం చేశాడని మరో మహిళ ఆరోపించారు. టీమ్ లీడర్లు, హెచ్ఆర్ ఉద్యోగితో సహా ఆరుగురిపై తొమ్మిది మంది బాధితులు ఫిర్యాదు చేశారు.
మరోవైపు మహిళా సిబ్బందిపై వేధింపులకు సంబంధించి గత నాలుగేళ్లలో పలు పోలీస్ స్టేషన్లలో 9 కేసులు నమోదయ్యాయి. దీంతో వీటిపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. ఏడుగురు మహిళా పోలీసులు మారువేషంలో నాసిక్‌లోని ఆ సంస్థలోకి ప్రవేశించారు. మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తనను ప్రత్యక్షంగా చూశారు. కొందరు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆధారాల కోసం ఆ సంస్థలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. వాటిని పరిశీలించిన తర్వాత మరింత మందిపై చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Six Team Leaders arrested within the BPO department at the Nashik (Maharashtra) office of TCS (Tata Consultancy Services), a renowned Indian IT company.
It is alleged that these individuals were sexually exploiting junior female employees. Furthermore, a young Hindu man was… pic.twitter.com/9bYkK4UXMA
— Madan Mohan Soni (@madanmohansoni) April 9, 2026
Also Read:
Man Beheads Driver, Mob Kills Him | డ్రైవర్ తల నరికిన వ్యక్తి.. అతడ్ని కొట్టి చంపిన స్థానికులు