పాట్నా: వీధి వ్యాపారి, వాహనం డ్రైవర్ మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యాపారి కత్తితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగా డ్రైవర్ తల నరికాడు. ఆ తర్వాత స్థానికులు అతడ్ని కొట్టి చంపారు. (Man Beheads Driver, Mob Kills Him) బీహార్‌లోని అరేరియా జిల్లాలో ఈ దారుణం జరిగింది. గురువారం ఉదయం ఫోర్బ్స్గంజ్ మార్కెట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రోడ్డు పక్కన వ్యాపారం చేసే రవి చౌహాన్, పికప్ వ్యాన్ డ్రైవర్ నబీ హుస్సేన్ మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో చౌహాన్ కత్తిలో హుస్సేన్‌పై దాడి చేశాడు. పలుమార్లు అతడ్ని పొడిచాడు. రోడ్డు మధ్యలో పడిపోయిన డ్రైవర్ నబీ హుస్సేన్ తల తెగేవరకు కత్తితో కోశాడు. తెగిన తలను పట్టుకుని రోడ్డుపై తిరిగాడు.
కాగా, ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. ఆ తర్వాత నబీ హుస్సేన్ కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి రవి చౌహాన్‌పై దాడి చేసి కొట్టారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని అతడ్ని రక్షించారు. తీవ్రంగా గాయపడిన చౌహాన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అయితే రోడ్డుపై తెగి పడి ఉన్న డ్రైవర్ నబీ హుస్సేన్ తలను ఫొటోలు, వీడియోలు తీసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీహార్‌లో భయానక పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలోని ఎన్డీయే పాలనపై మండిపడ్డారు. ‘ఒక వ్యక్తి నడిబజారులో, వందలాది మంది ప్రజల సమక్షంలో, మరో వ్యక్తి గొంతు కోసి చంపాడు. ఆ తెగిన తలతో అటూ ఇటూ తిరిగాడు. ఆ తర్వాత, మృతుడి కుటుంబ సభ్యులు ఆ హంతకుడిని తిరిగి హత్య చేశారు’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి పీఠం’ కోసం కుర్చీల ఆటలో అధికార కూటమి నేతలు నిమగ్నమై ఉండగా, బీహార్‌లో ఇలాంటి దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆరోపించారు.
Broad Daylight Beheading in Bihar’s Forbesganj – Parking Row Turns Deadly
A shocking double murder in Bihar’s Araria district has left people in fear and raised serious questions about law and order.
The incident took place on Thursday in Forbesganj town, where a small
1/10 pic.twitter.com/GdHJAJVAA1— Siraj Noorani (@sirajnoorani) April 10, 2026
#ExtremelyGraphic : Man Beheaded in Forbesganj, Suspect Killed by Mob
A minor parking dispute in a vegetable market in Forbesganj escalated into a brutal double killing on April 9, 2026. Police say a pickup driver was attacked and killed by a vendor, after which an enraged crowd… pic.twitter.com/W864ZnntdQ
— upuknews (@upuknews1) April 9, 2026
Also Read:
Nitish Kumar: రాజ్యసభ సభ్యుడిగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రమాణం