Heavy Rains | రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వానలు.. హైదరాబాద్ సహా 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Heavy Rains | క్యుమిలోనింబస్ మేఘాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశమున్నదని వెల్లడించింది.
Heavy Rains | హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): క్యుమిలోనింబస్ మేఘాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశమున్నదని వెల్లడించింది. హైదరాబాద్ సహ 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా కామారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ అయ్యింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువొచ్చు. కాగా, గడిచిన 24 గంటల్లో 4 మండలాల్లో 11.56 సెం.మీ నుంచి 20.44 సెం.మీ మధ్య వర్షపాతం నమోదైంది. 6.45 సెం.మీ నుంచి 11.55 సెం.మీ మధ్య 40 మండలాల్లో, 1.56 సెం.మీ నుంచి 6.44 సెం.మీ మధ్య 281 మండలాల్లో వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా పిట్లంలో 14.11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

