Househelp’s Thar, cash reels | పనిమనిషికి థార్, నోట్ల కట్టలతో ఆమె రీల్స్.. పోలీస్ అధికారి అవినీతి కేసులో ట్విస్ట్
Househelp's Thar, cash reels | పోలీస్ అధికారి పనిమనిషి థార్‌లో తిరిగేది. ఆ వాహనంలో పనికి వెళ్లేంది. డబ్బుతో రీల్స్ కూడా చేసింది. ఒక పోలీస్ అధికారి విలాసవంతమైన జీవనశైలిని ఇవి బయటపెట్టాయి. దీంతో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు మరో మలుపు తీసుకున్నాయి.
పాట్నా: పోలీస్ అధికారి పనిమనిషి థార్‌లో తిరిగేది. ఆ వాహనంలో పనికి వెళ్లేంది. డబ్బుతో రీల్స్ కూడా చేసింది. (Househelp’s Thar, cash reels) ఒక పోలీస్ అధికారి విలాసవంతమైన జీవనశైలిని ఇవి బయటపెట్టాయి. దీంతో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు మరో మలుపు తీసుకున్నాయి. బీహార్ డీఎస్పీ గౌతమ్ కుమార్‌కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఎస్డీపీవోగా ఆయన పని చేస్తున్న కిషన్‌గంజ్‌తో పాటు పాట్నా, పూర్నియాలో ఆర్థిక నేరాల విభాగం (ఈవోయూ) అధికారులు సోదాలు చేశారు. రూ. 80 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
కాగా, పూర్నియాలో 16 ప్లాట్లను గౌతమ్ కుమార్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏడుగురు ప్రియురాళ్లు, నలుగురు భార్యలు, ముగ్గురు అత్తలు, ఒక కుమారుడి పేర్ల మీద ఆ ఆస్తులను రిజిస్టర్ చేసినట్లు తెలుసుకున్నారు. సిలిగురిలో ఒక టీ ఎస్టేట్, బంగ్లా, రెండంతస్తుల భవనాన్ని కూడా దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7న బీహార్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డీఎస్పీ గౌతమ్ కుమార్‌ను సస్పెండ్ చేసింది.
మరోవైపు గౌతమ్ కుమార్ అవినీతి కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ఇంటి పనిమనిషి పారో ఆయన ద్వారా చాలా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈవోయూ అధికారులు తాజాగా గుర్తించారు. ఆమెకు థార్ వాహనం ఉన్నదని, ఇంటి పనులు చేసేందుకు ఆ వాహనంలో గౌతమ్ కుమార్ ఇంటికి చేరుకునేదని తెలుసుకున్నారు. అలాగే నోట్ల కట్టలు ప్రదర్శిస్తూ పారో చేసిన సోషల్ మీడియా రీల్స్ కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పారోతో కూడా గౌతమ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి పారో, ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియడం లేదు.
కాగా, ఒక సంతానం కూడా ఉన్న ప్రియురాలి రాజకీయ ఆశయాలకు మద్దతు ఇవ్వడం కోసం గౌతమ్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెడుతున్నట్లు ఈవోయూ దర్యాప్తులో వెల్లడైంది. కిషన్‌గంజ్ నుంచి అభ్యర్థిగా ఆమెను నిలబెట్టడానికి ఆయన సిద్ధమవుతున్నాడని దర్యాప్తు సంస్థ తెలిపింది.
అలాగే 2030లో పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆశయాలు గౌతమ్ కుమార్‌కు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించిన ఆస్తులను ఆయన ఎలా కూడబెట్టాడు, వాటిని ఎలా బదిలీ చేస్తున్నాడు అన్నదానిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Nitish Kumar: రాజ్యసభ సభ్యుడిగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రమాణం
Monalisa | వివాదంలో సోషల్ మీడియా స్టార్ మోనాలిసా వివాహం .. మైనర్ అని తేలడంతో భర్తపై పోక్సో కేసు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

