నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య.. మధ్యప్రదేశ్‌లో హనీమూన్ మర్డర్ కేసును మించిన ఘటన
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును మించిన మరో ఘటన మధ్యప్రదేశ్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రియుడితో వివాహేతర సంబంధం కారణంగా సుపారీ గ్యాంగ్‌తో భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్లుగా భర్త శవం ముందు మొసలి కన్నీరు కార్చింది.
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును మించిన మరో ఘటన మధ్యప్రదేశ్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రియుడితో వివాహేతర సంబంధం కారణంగా సుపారీ గ్యాంగ్‌తో భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్లుగా భర్త శవం ముందు మొసలి కన్నీరు కార్చింది. ఆమె యాక్టింగ్ చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు. కానీ పోలీసులు మాత్రం తెలివిగా ఆమెనే నిందితురాలు అని కనిపెట్టేశారు.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన దేవకృష్ణ రోహిత్ (28) సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి ప్రియాంక పురోహిత్(25)కి కొంతకాలం కిందట పెళ్లయ్యింది. ఇదిలా ఉంటే ఈ నెల 7వ తేదీన రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు అతనిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతని భార్య ప్రియాంక ఇంట్లో కట్టేసి కనిపించింది. ఏం జరిగిందని ఇరుగుపొరుగు, కుటుంబసభ్యులు ఆరా తీయగా కొందరు దుండగులు అకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడి తన భర్తపై దాడి చేశారని తెలిపింది. తనను ఓ గదిలో కట్టేశారని.. అరిస్తే చంపేస్తామని పీక మీద కత్తి పెట్టారని పేర్కొంది. ఇంట్లో ఉన్నదంతా దోచేసి, తన భర్తను అన్యాయంగా చంపేశారని కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఆమె ఏడుపు, చెప్పిన విధానం చూస్తే ఎవరికి అయినా అయ్యో పాపం అని అనిపించేలా సహజంగానే ఉన్నాయి. దీంతో అందరూ ఆమెను నమ్మేశారు. చివరకు పోలీసులు కూడా తొలుత ఆమె చెప్పిందే నిజమని అనుకున్నారు. కానీ దర్యాప్తు చేసే సమయంలో ఇంట్లో దోపిడీ జరిగినట్లుగా ఎక్కడా అనిపించలేదు. దీంతో ప్రియాంకను పోలీసులు మళ్లీ విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఆమె కాల్ డేటాను, మొబైల్ లొకేషన్లను పరిశీలించిన పోలీసులు.. కమలేశ్ పురోహిత్ అనే వ్యక్తితో ప్రియాంకకు అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

Madhyapradesh Murder Case1
అప్పుడు ప్రియాంకను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. వివాహేతర సంబంధం కారణంగానే భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నట్లుగా ప్రియాంక బయటపెట్టింది. సురేంద్ర అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు ఒప్పుకుంది. తన భర్త దేవకృష్ణ నల్లగా ఉండటం ఆమెకు నచ్చలేదని తెలిపింది. ‘నువ్వు చాలా నల్లగా ఉన్నావు. నాకు అసలు తగవు. నా స్థాయికి తగ్గ మనిషివి కాదు’ అంటూ ప్రియాంక తరచూ దేవకృష్ణను అవమానించేదని పోలీసుల విచారణలో తెలిసింది.
తన భర్త నల్లగా ఉన్నాడని, తన స్థాయికి అతను సరిపోడని, ఈ క్రమంలో కమలేష్ అనే వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధం బయటపడడంతో, అడ్డు తొలగించుకునేందుకు భర్తను హతమార్చినట్లు గుర్తించి నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

