లక్నో: పర్యాటకులతో వెళ్తున్న పడవ యుమునా నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. (boat capsizes in Vrindavan) ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పంజాబ్లోని లూథియానాకు చెందిన సుమారు 30 మంది ఉత్తరప్రదేశ్లోని బృందావనాన్ని సందర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు బోట్లలో యుమునా నదిలో ప్రయాణించారు.
కాగా, బలంగా వీచిన గాలులకు ఒక బోటు తీవ్రంగా ఊగిపోయింది. పాంటూన్ వంతెనను ఢీకొట్టడంతో ఆ పడవ బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు పంజాబ్లోని లూథియానాకు చెందిన పది మంది పర్యాటకుల మృతదేహాలను ఇప్పటివరకు వెలికితీశారు. నదిలో గల్లంతైన మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో సహా పలువురు ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Massive tragedy in Mathura as a steamer boat carrying 30 devotees capsizes in the Yamuna river after hitting a pontoon bridge near Vrindavan. 🛥️💔 Heartbreaking reports of at least 6-9 deaths. Rescue operations are currently underway. Praying for the families. 🙏 #Mathura #Yamuna… pic.twitter.com/EjPVVxlQqk
— Dipak (@Rohit51388267) April 10, 2026
Also Read:
coercion at Nashik firm | ఎంఎన్సీ కంపెనీలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు.. ఆరుగురు అరెస్ట్
Man Beheads Driver, Mob Kills Him | డ్రైవర్ తల నరికిన వ్యక్తి.. అతడ్ని కొట్టి చంపిన స్థానికులు