సీఎం రేవంత్‌రెడ్డి పేరుతో కారు చక్కర్లు
వాహనానికి నంబర్ ప్లేట్ సరిగ్గా లేదనో... చిన్న గీత పడిందనో.. నంబర్‌ప్లేట్‌పై ఇతర పేర్లు ఉండద్దనో ఇలా.. ఒకరు కెమెరాలతో చలాన్లు వేస్తుంటే.. మరొకరు బండిని రోడ్డు మధ్యలో అపేసి జరిమానాలు వేస్తుండడం.. వేసిన చలాన్లు వసూలు చేయడమే విధిగా మరికొందరు ట్రాపిక్ పోలీసులు ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న ఘటనలు గ్రేటర్లో నిత్యకృత్యంగా మారాయి.
- చోద్యం చూసిన పోలీసులు
వాహనానికి నంబర్ ప్లేట్ సరిగ్గా లేదనో… చిన్న గీత పడిందనో.. నంబర్‌ప్లేట్‌పై ఇతర పేర్లు ఉండద్దనో ఇలా.. ఒకరు కెమెరాలతో చలాన్లు వేస్తుంటే.. మరొకరు బండిని రోడ్డు మధ్యలో అపేసి జరిమానాలు వేస్తుండడం.. వేసిన చలాన్లు వసూలు చేయడమే విధిగా మరికొందరు ట్రాపిక్ పోలీసులు ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న ఘటనలు గ్రేటర్లో నిత్యకృత్యంగా మారాయి.
సిటీబ్యూరో/ఎల్బీనగర్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ఈ చట్టాలు, జరిమానాలు అన్ని సాధారణ ప్రజలకే పరిమితమవుతున్నాయి. అధికార పార్టీ నేతల పేర్లు.. ముఖ్యమంత్రి బొమ్మలుంటే ట్రాఫిక్ రూల్స్, ఆర్టీఏ రూల్స్ పాటించాల్సిన పని లేదనే ధీమాతో కొందరు వాహనదారులు నగరంలో తిరుగుతున్నారు. ఇలాంటి వాహనాలు ఏమి చేసినా చెల్లిపోతుంది.. అలాంటి వారిపై ట్రాపిక్ పోలీసులు కన్నెత్తి కూడా చూడరు. దిల్‌సుక్‌నగర్ ప్రధాన రహదారిపై ఓ కారు చేసిన హంగమాను చూస్తే ఎవరికైనా పోలీసులుపై ఇలాంటి అనుమానాలు రాకమానవు. ఏ వాహనానికైనా రిజిస్ట్రేషన్ నంబర్ అనేది దానికి గుర్తింపుగా ఉంటుంది.
కానీ దిల్‌సుఖ్‌నగర్‌లో రోడ్డుపై స్వేచ్ఛగా వివహరించిన ఓ కారుకు మాత్రం అసలు నంబర్ ప్లేటే లేదు.. నంబర్ ఉండాల్సిన స్థానంలో ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పేరును ముద్రించుకొని ఆయన చిత్రంతో పాటు ‘తెలంగాణ టైగర్’ అంటూ స్లోగన్స్‌ను రాసుకొని తిరుగుతున్నారు. రోడ్లపై ఈ వాహ నం హంగామా చేస్తూ వెళ్తుంటుంది. ఈ వా హనం దిల్‌సుఖ్‌నగర్‌లో తిరిగిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరు అడ్డుకోవడానికి ముందుకు రారు.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉంటే పోలీసులు కనీసం ఆ వాహనంపై వైపు చూడకపోవడం అశ్చర్యం గా ఉందంటూ స్థానికులు వాపోతున్నారు.
అభిమానమా? జిమ్మిక్కా…?
కారు నంబర్ ప్లేట్‌కు బదులుగా తమ నాయకుడి పేరును రాసుకోవడంలో మితిమీరిన అభిమానామా? లేక కారుకు సరిగ్గా డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి వేసిన రాజకీయ జిమ్మిక్కా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేరు వెనుక దాక్కుని రూల్స్ బ్రేక్ చేసే సంస్కృతికి రోజు రోజుకు పెరిగిపోతుంటే, ట్రాఫిక్ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం చట్టబద్ధ్ద పాలనకే మచ్చ తెచ్చేలా ఉంది. చట్టం ముందు అంద రూ సమానులే అని నిరూపించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఇలాంటి అక్రమ నంబర్ ప్లేట్లపై అత్యుత్సాహాన్ని ప్రదర్శించే వాహనదారులకు ట్రాఫిక్ ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి స్పాట్ చలాన్లతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

