student rescued parents from digital arrest | డిజిటల్ అరెస్ట్ స్కామ్ నుంచి.. తల్లిదండ్రులను కాపాడిన కుమారుడు
student rescued parents from digital arrest | డిజిటల్ అరెస్ట్ స్కామ్ పేరుతో ఒక వ్యాపారిని మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నించారు. ఆ వ్యాపారి, అతడి భార్యను సుమారు పది గంటల పాటు గదిలో నిర్బంధించారు. వారి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకున్నారు. అయితే స్కూల్ విద్యార్థి అయిన కుమారుడు తన తల్లిదండ్రులను సైబర్ మోసగాళ్ల బారి నుంచి కాపాడాడు.
లక్నో: డిజిటల్ అరెస్ట్ స్కామ్ పేరుతో ఒక వ్యాపారిని మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నించారు. ఆ వ్యాపారి, అతడి భార్యను సుమారు పది గంటల పాటు గదిలో నిర్బంధించారు. వారి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకున్నారు. అయితే స్కూల్ విద్యార్థి అయిన కుమారుడు తన తల్లిదండ్రులను సైబర్ మోసగాళ్ల బారి నుంచి కాపాడాడు. (student rescued parents from digital arrest) ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రేమ్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యాపారి సంజయ్ సక్సేనా, అతడి భార్యను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. గుర్తు తెలియని నంబర్ నుంచి వారికి ఫోన్ చేశారు. దర్యాప్తు సంస్థ అధికారులమని నమ్మించారు. ఉగ్రవాద కార్యకలాపాలు, కోట్ల కుంభకోణంతో సక్సేనాకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
కాగా, వీడియో కాల్ సందర్భంగా నకిలీ అరెస్ట్ వారెంట్‌ను సైబర్ మోసగాళ్లు చూపించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆ దంపతులను బెదిరించారు. సుమారు పది గంటల పాటు గదిలో నిర్బంధించారు. వారిని నిరంతరం కెమెరా నిఘాలో ఉంచారు. మానసికంగా ఒత్తిడి చేసి బ్యాంకు వివరాలు సేకరించారు. డబ్బును కాజేయడానికి సిద్ధమయ్యారు.
మరోవైపు 8వ తరగతి చదువుతున్న కుమారుడు తన్మయ్‌కు ఏదో తేడాగా ఉన్నట్లు అనుమానం కలిగింది. తీవ్ర భయంతో ఉన్న తల్లిదండ్రులు అతడి జోక్యాన్ని తొలుత వ్యతిరేకించారు. అయితే ఆ బాలుడు అర్ధరాత్రి వేళ మొబైల్ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లోకి మార్చాడు. దీంతో మోసగాళ్లతో సంభాషణ అకస్మాత్తుగా నిలిచిపోయింది. సైబర్ నేరగాళ్ల మోసాన్ని ఇది భగ్నం చేసింది. అలాగే ఎలాంటి ఆర్థిక నష్టం జరుగకుండా నివారించింది.
మరునాడు ఉదయం ఆ కుటుంబం ప్రేమ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. డిజిటల్ అరెస్ట్ మోసం గురించి పోలీస్ అధికారికి వివరించారు. మొబైల్ ఫోన్ తిరిగి ఆన్ చేయగా సైబర్ మోసగాళ్లు మళ్లీ కనెక్ట్ అయ్యారు. అయితే ఆ వీడియో కాల్‌కు పోలీస్ అధికారి సమాధానం ఇవ్వడంతో సైబర్ నేరగాళ్లు కంగుతిన్నారు. వీడియో కాల్‌ను కట్ చేశారు.
కాగా, ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. డిజిటల్ అరెస్ట్‌కు సంబంధించిన బెదిరింపు ఫోన్ కాల్స్ గురించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని, ఆర్థిక వివరాలు వెల్లడించవద్దని ఆయన సూచించారు.
Also Read:
boat capsizes in Vrindavan | యమునా నదిలో పడవ బోల్తా.. పది మంది మృతి, పలువురు గల్లంతు
coercion at Nashik firm | ఎంఎన్సీ కంపెనీలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు.. ఆరుగురు అరెస్ట్
Man Beheads Driver, Mob Kills Him | డ్రైవర్ తల నరికిన వ్యక్తి.. అతడ్ని కొట్టి చంపిన స్థానికులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

