Kerala CEO dance : కేరళ (Kerala) సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేరళ ఓటర్లలో ఓటర్లలో చైతన్యం పెంపొందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (CEO) రతన్ యూ కేల్కర్ (Ratan U Kelkar) డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నది. ఇటీవల కొచ్చిలో భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ విడుదల చేసిన వీడియోలో ఆ డ్యాన్స్‌కు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి.
మొత్తం 1.33 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో కేల్కర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి సముద్ర తీరంలో డ్యాన్స్ చేస్తున్నారు. తిరువనంతపురం కలెక్టర్ అను కుమారి, అసిస్టెంట్ కలెక్టర్ శివశక్తివేల్ తదితర అధికారులు వీడియోలో ఉన్నారు. ‘ఇది మీ ఓటు.. మన రాష్ట్రానికి మీ ఓటు అవసరం ఉంది. ఒకే లక్ష్యం ఆటను మార్చగలదు. ఒక ఓటు తలరాతను మార్చగలదు’ అని ఈ వీడియో సాంగ్‌లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ వీడియోను చూసేయండి..
#WATCH | To inspire young voters and boost participation in Keralam, a vibrant Gen Z-themed song set the stage as Chief Electoral Officer Dr Rathan U. Kelkar and Thiruvananthapuram District Collector Anu Kumari joined in with energetic steps.
Joining them were Assistant… pic.twitter.com/2P7XMEbWLm
— ANI (@ANI) April 6, 2026