e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News 23 ఏళ్ళ కిందే సినిమాలు వదిలేద్దాం అనుకున్నా: పవన్ కళ్యాణ్

23 ఏళ్ళ కిందే సినిమాలు వదిలేద్దాం అనుకున్నా: పవన్ కళ్యాణ్

23 ఏళ్ళ కిందే సినిమాలు వదిలేద్దాం అనుకున్నా: పవన్ కళ్యాణ్

అదేంటి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు కూడా కాలేదు.. అంటే వచ్చిన రెండు సంవత్సరాల్లోనే సినిమాలకు దూరం కావాలని ఆయన నిర్ణయించుకున్నారా.. కనీసం రెండు సినిమాలు కూడా చేయక ముందే ఆయన రిటైర్మెంట్ ఇచ్చేద్దాం అనుకున్నారా..? ఇదెక్కడి చిత్రం అనుకుంటున్నారా..! పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఎప్పుడు అలాగే ఉంటాయి మరి. అందుకే అజ్ఞాతవాసిలో వీడి చర్యలు ఊహాతీతం అంటూ త్రివిక్రమ్ డైలాగ్ కూడా రాశాడు. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ముచ్చట దాదాపు 23 ఏళ్ళ కింద జరిగింది.

- Advertisement -

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ వెంటనే గోకులంలో సీత అంటూ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ మార్చేసిన సినిమా సుస్వాగతం. కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువ చేసింది ఈ సినిమా. ఇదిలా ఉంటే ఈ సినిమా సమయంలోనే రిటైర్మెంట్ ఇచ్చేద్దామని పవన్ కళ్యాణ్ అనుకున్నాడు. దీని వెనక ఒక చిన్న సరదా సన్నివేశం ఉంది. ఇందులో ఒక సన్నివేశం ప్రకారం రోడ్డుపై నిలబడి డాన్స్ చేయాలి. అప్పటి వరకూ ఆయన చేసిన రెండు సినిమాల్లో ఎక్కువగా ఇన్ డోర్ సన్నివేశాలు ఉన్నాయి. కానీ సుస్వాగతంలో అవుట్ డోర్ ఎక్కువగా ఉంటుంది.

రోడ్డుపై నిలబడి డాన్సులు చేయాలి అని దర్శకుడు చెప్పేసరికి పవన్ కళ్యాణ్ కి ఎక్కడ లేని సిగ్గు, మొహమాటం అడ్డొచ్చాయి. దాంతో అక్కడి నుంచి పారిపోవాలని తనకు అనిపించిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు పవన్ కళ్యాణ్. అంతేకాదు ఇలాంటి సీన్స్ చేయాలి అంటే సినిమాలకు దూరం అవ్వాలని నిశ్చయించుకున్నట్లు అప్పట్లో చెప్పాడు. ఇదే విషయం ఇంటికి వచ్చి వదిన సురేఖకు చెబితే తనకు క్లాస్ తీసుకుందని.. అన్నయ్య చిరంజీవి ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాడు అనేది తనకు పూసగుచ్చినట్లు చెప్పింది అంటూ గుర్తుచేసుకున్నాడు పవన్. అన్నయ్య కష్టం తెలిసిన తర్వాత తన నిర్ణయం మార్చుకుని.. అప్పటినుంచి అలాంటి సన్నివేశాలు వచ్చినా కూడా మొహమాటపడకుండా నటించాను అంటున్నాడు

అయితే నాటి నుంచి నేటి వరకు కూడా పవన్ కళ్యాణ్ కు సినిమాలు అంటే అదే అనాసక్తి కనిపిస్తుంది. ఏదో చెయ్యాలి అన్నట్లు చేస్తాడు కానీ సినిమాలపై పూర్తి కాన్సన్ట్రేషన్ మాత్రం ఆయనకు లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, అలాగే అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరీష్ శంకర్ సినిమాలు కమిట్ అయ్యాడు పవర్ స్టార్. వీటి తర్వాత మరో మూడు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

చెప్పిన డేట్‌కి వ‌స్తున్న మెగాస్టార్

పంజాబీ సినిమాల‌పై ఆర్ఎక్స్ 100 భామ ఫోక‌స్‌..!

నో ఏజ్‌..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!

అన‌న్య‌పాండే క్యాలెండ‌ర్ స్టిల్ అద‌ర‌హో..!

స్పెష‌ల్ సాంగ్ లాంఛ్ చేయ‌నున్న స‌మంత

ఆర్ఆర్ఆర్ చివ‌రి ఘ‌ట్టానికి ముహూర్తం ఫిక్స్..!

సీఎం స‌హాయ‌నిధికి రూ.25 ల‌క్ష‌లు విరాళం ఇచ్చిన విజ‌య్ సేతుప‌తి

కొత్త సినిమాలో ర‌వితేజ పాత్ర ఇదే..!

థియేట‌ర్ల‌లోనే అక్ష‌య్ బెల్‌బాట‌మ్‌.. రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌

విజ‌య్ సేతుప‌తితో ప్ర‌శాంత్ నీల్ చ‌ర్చ‌లు..!

అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
23 ఏళ్ళ కిందే సినిమాలు వదిలేద్దాం అనుకున్నా: పవన్ కళ్యాణ్
23 ఏళ్ళ కిందే సినిమాలు వదిలేద్దాం అనుకున్నా: పవన్ కళ్యాణ్
23 ఏళ్ళ కిందే సినిమాలు వదిలేద్దాం అనుకున్నా: పవన్ కళ్యాణ్

ట్రెండింగ్‌

Advertisement