నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
టాలీవుడ్ లో సీనియర్ హీరోలు అంటే చాలామంది ఉన్నారు. అందులో అందరి కంటే ఫిట్ గా ఎవరుంటారనే ప్రశ్న వచ్చింది అంటే.. సమాధానం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టాలీవుడ్ లో సీనియర్ హీరోలు అంటే చాలామంది ఉన్నారు. అందులో అందరి కంటే ఫిట్ గా ఎవరుంటారనే ప్రశ్న వచ్చింది అంటే.. సమాధానం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నూటికి 90 మంది నాగార్జున అని ఠక్కున చెప్తారు. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు కూడా లేవు. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా నాగార్జునను చూస్తే ఏంట్రా బాబు ఈ ఫిట్ నెస్ అని అందరికీ అనిపిస్తుంది. అంతెందుకు ఇప్పటికి ఈయనను మన్మధుడు అని పిలుస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఈయన గ్లామర్ రేంజ్ ఏంటో. కుర్ర హీరోలు కూడా నాగార్జునతో పోటీపడలేకపోతున్నారు.
అరవై దాటిన తర్వాత కూడా అదే జోరు చూపిస్తూ అందరికీ సవాల్ విసురుతున్నాడు సోగ్గాడు. ఇదిలా ఉంటే తాజాగా మరో సంచలనం సృష్టించాడు నాగార్జున. కొన్నేళ్లుగా తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు అక్కినేని అందగాడు. ఈ మధ్య నటించిన వైల్డ్ డాగ్ సినిమా థియేటర్లలో పెద్దగా అలరించకపోయినా.. ఓటిటీలో మాత్రం దుమ్ము దులిపేసింది. తాజాగా మరోసారి అలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు నాగార్జున. గరుడవేగ లాంటి హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక డ్రామా చేస్తున్నాడు.
ఈ సినిమాలో రా ఏజెంట్ గా నటిస్తున్నాడు నాగార్జున. దీని కోసం తనని తాను చాలా మార్చుకున్నాడు. అంతేకాదు ఆ పాత్రలో పర్ఫెక్ట్ గా కనిపించడానికి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని.. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అంటూ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ల కోసం జిమ్ లో చెమట చిందిస్తున్నాడు. నాగార్జున వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత నాగార్జున డెడికేషన్ కు అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు.
ఇవి కూడా చదవండి..
మహేశ్, ప్రభాస్ గురించి సుబ్బరాజు ఏమన్నాడంటే..?
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

