సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా రాజేంద్రనగర్లో 5.50 సెం.మీలు, రామచంద్రాపురంలో 3.10 సెం.మీలు, లింగంపల్లిలో 2.40 సెం.మీలు, చందానగర్లో 1.73 సెం.మీలు చొప్పున వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రుతుపవనాల ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించారు.