రాష్ట్రంలో 4 ఇండస్ట్రియల్ పార్కులు
రాష్ట్రంలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
- ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ భవ్య పథకంలో భాగంగా మొదటి దశలో రాష్ట్రంలో ఏర్పాటు చేసే నాలుగు ఇండస్ట్రియల్ పార్కులకు సంబంధించిన పూర్తి ప్రాజెక్టు రిపోర్టును ఈ నెలఖారులోగా కేంద్రానికి అందజేయనున్నట్టు చెప్పారు.
ఒక్కో పార్కు 500 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉంటుందని, ఇందుకు సంబంధించి భూసేకరణ ఇతర ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ నాలుగు పార్కులు కందుకూరు మండలం తిమ్మాపూర్, ఇబ్రహీంపట్నం ఎలిమినేడు, ఘట్కేసర్ మండలం మాదారం, చౌటుప్పల్ మండలం దండుమైలారంలో ఉండనున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

