డీపీఆర్ పూర్తికాని ట్రిపుల్ఆర్-సౌత్
హైదరాబాద్‌లో రీజినర్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం డీపీఆర్ ఇంకా పూర్తికాలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఉత్తర భాగం పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
- రాజ్యసభలో గడ్కరీ వెల్లడి
హైదరాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో రీజినర్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం డీపీఆర్ ఇంకా పూర్తికాలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఉత్తర భాగం పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఎంపీ కే లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఉత్తర భాగానికి సంబంధించి 161.518 కి.మీ పొడవు, 6 లేన్లుగా డీపీఆర్ సిద్ధమైందని స్పష్టంచేశారు.
ఈ ప్రాజెక్టు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్)లో రూ.23, 935.6 కోట్ల అంచనా వ్యయంతో అమలుచేసేందుకు పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ పరిశీలించిందని పేర్కొన్నారు. 99.06 శాతం భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా.. 87.19 శాతం భూసేకరణకు అవార్డు ప్రకటించినట్టు తెలిపారు. ప్రాజెక్టు అమలు కాలపరిమితిని డీపీఆర్, ఫీజిబులిటీ అధ్యయనం, సంబంధిత అధికారుల ఆమోదం అనంతరం ఖరారు చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో నాలుగు జాతీయ రోడ్డు ప్రాజెక్టులు పీపీపీ విధానంలో చేపట్టినట్టు గడ్కరీ తెలిపారు. రూ.10, 772.24 కోట్ల అంచనా వ్యయంతో 270.77 కి.మీ రహదారి పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

