గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 20:49:21

వ‌ర్షంలో 'ఓదెల రైల్వే స్టేష‌న్' షూటింగ్..వీడియో

వ‌ర్షంలో 'ఓదెల రైల్వే స్టేష‌న్' షూటింగ్..వీడియో

అశోక్ తేజ (డెబ్యూట్‌)ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ఓదెల రైల్వే స్టేష‌న్‌. డైరెక్ట‌ర్ సంప‌త్‌నంది క‌థ‌నందిస్తున్నాడు.  కేజీఎఫ్ ఫేం వ‌శిష్ట సింహ, సాయి సోన‌క్‌, పూజిత పొన్నాడ‌, హెబా ప‌టేల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని పొత్క‌ప‌ల్లి ప్రాంతంలో కొన‌సాగుతుంది. న‌టీన‌టుల‌పై పొత్క‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. 

మా టీం అంతా సీన్ కు అనుకూలంగా వ‌ర్షం ఎఫెక్ట్‌ ఉండాల‌నుకున్నాం. కానీ అదృష్ట‌వ‌శాత్తు ప్ర‌కృతి తల్లి క‌రుణించి వ‌ర్షం ప‌డ‌టంతో టీం మెంబ‌ర్స్ అంతా క‌ష్ట‌ప‌డి షూట్ చేశామ‌ని నిర్మాత కేకే రాధామోహ‌న్ ట్విట‌ర్ లో షేర్ చేసుకున్నారు. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కేకే రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముంబై భామ హేబా ప‌టేల్ ఈ చిత్రంలో డీగ్లామ‌ర‌స్ రోల్ లో క‌నిపించ‌నుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo