టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా ఆమోదం
టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా ఆమోదం | కరోనా మహమ్మారితో ప్రపంచమంతా సతమతమవుతోంది. వైరస్ కట్టడికి టీకానే ప్రధాన ఆయుధంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కీలకమైన టీకా మేధో సంపత్తి హక్కుల రద్దుకు జోబైడైన్ నేతృత్వంలోని అమెరికా మద్దతు తెలిపింది.

వాషింగ్టన్ : కరోనా మహమ్మారితో ప్రపంచమంతా సతమతమవుతోంది. వైరస్ కట్టడికి టీకానే ప్రధాన ఆయుధంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కీలకమైన టీకా మేధో సంపత్తి హక్కుల రద్దుకు జోబైడైన్ నేతృత్వంలోని అమెరికా మద్దతు తెలిపింది. మహమ్మారిపై పోరులో ప్రపంచ దేశాలకు మద్దతునిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ ట్రేడ్ ప్రతినిధి కేథరిన్ వెల్లడించారు. మేథో సంపత్తి హక్కుల పరిరక్షణకు.. బైడెన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కానీ, వైరస్ అంతానికి కరోనా టీకాలకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రద్దుచేసేందుకు అమెరికా మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. అయితే, ఈ అంశంలో ప్రపంచవాణిజ్య సంస్థ సూత్రాలకు అనుగుణంగా.. అంతర్జాతీయ ఒప్పందాలు కుదిరేందుకు సమయం పడుతుందని కేథరిన్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కోసం అనేక దేశాలు టీకాలు ఉత్పత్తి చేసేలా.. అంతర్జాతీయ వాణిజ్య నియమాలను సరళీకృతం చేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అయితే, పలు అభివృద్ధి చెందిన దేశాలు, బలమైన ఫార్మాసూటికల్ కంపెనీలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం.. దీనికి ఏకాభిప్రాయం కావాల్సి ఉండగా.. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. అగ్ర దేశాలను ఈ విషయంలో ఒప్పించడానికి దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా మద్దతు తెలుపడం కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే, అమెరికా తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ బుధవారం ప్రశంసించారు. నిర్ణయం చారిత్రాత్మకమని అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు వానలు
ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. సరిహద్దులను మూసివేసిన ఛత్తీస్‌గఢ్
06-05-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
క్యాన్సర్ రోగులూ కరోనాతో జాగ్రత్త
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

