కార్తికేయ 2 | స్వామి రారా తర్వాత ఎప్పటికప్పుడు సరికొత్త కథలు ఎంచుకుంటూ యూత్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నిఖిల్. ఈయన ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి 18 పేజెస్ అయితే.. మరోటి విలక్షణ దర్శకుడు చందూ మెండేటి తెరకెక్కిస్తున్న కార్తికేయ 2. ఏడేళ్ల కింద వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ ఇది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మాయ చేస్తున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కార్తికేయ 2 షూటింగ్ కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లోని సిస్సులో జరుగుతుంది.
హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్తో పాటు ఇతర నటీనటులు కూడా అక్కడే ఉన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ మంచు ఎక్కువగా కురుస్తుండటంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి ఆపేయాల్సి వచ్చింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు.
#Karthikeya2 unit, including @actor_Nikhil , Heroine ,Several other Cast and Crew stuck in a snow storm in Sissu, Himachal Pradesh. Shoot stopped for now.
— BA Raju's Team (@baraju_SuperHit) March 24, 2021
Unit plans to shoot high-octane action scenes once storm passes. pic.twitter.com/giLECBFWYV
ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
అర్జున్ సురవరం తర్వాత నిఖిల్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు చందూ మొండేటి మాత్రం సవ్యసాచి ఫ్లాప్ నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సీక్రెట్ ప్లేస్‌లో సారా..ట్రెండింగ్‌లో స్టిల్స్
రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం
మహేశ్‌బాబు తండ్రిగా మలయాళ నటుడు..?
జనాల్లేక థియేటర్స్ మూసుకుంటున్న యాజమాన్యం
వర్షంలో చైతూ, సాయిపల్లవి డ్యాన్స్
నిన్ను మించిన వాళ్లు లేరు.. కంగనపై సమంత ప్రశంసల వర్షం
థాయ్‌లాండ్ ఫారెస్ట్‌లో 15 రోజులున్నా: రానా
ఐశ్వర్యరాజేశ్ ఫైనల్..మరో హీరోయిన్ కోసం వేట..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి
ఈ ఇద్దరు కొత్త హీరోయిన్ల సుడి పీక్స్.. స్టార్ హీరోలతో ఆఫర్స్
తరుణ్ రీఎంట్రీ.. లవ్ స్టోరీతో వస్తున్నాడంట