e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home News క‌రోనా ఎఫెక్ట్ : ఆచార్య సినిమా రిలీజ్‌ వాయిదా ..?

క‌రోనా ఎఫెక్ట్ : ఆచార్య సినిమా రిలీజ్‌ వాయిదా ..?

క‌రోనా ఎఫెక్ట్ : ఆచార్య సినిమా రిలీజ్‌ వాయిదా ..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్‌ వాయిదా పడుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. దానికి తోడు మొన్న విడుదలైన లాహే లాహే పాట యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సాహితీ చాగంటి, హారిక నారాయణ్ పాడారు. ఈ పాటతో పాటు టీజర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ.100 కోట్లకు పైగా జరుగుతుంది. కోవిడ్ తర్వాత తెలుగులో విడుదలవుతున్న భారీ సినిమాల్లో ఆచార్య ముందు వరుసలో ఉంటుంది. మే 13న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆచార్య సినిమా రిలీజ్‌ వాయిదా వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

క‌రోనా ఎఫెక్ట్ : ఆచార్య సినిమా రిలీజ్‌ వాయిదా ..?

దేశంలో రోజుకు లక్ష 60 వేల‌కు పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ 4 వేల కేసులు వస్తున్నాయి.ఈ క్రమంలో సినిమాను వాయిదా వేయడం మంచిదని నిర్మాతలు భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో మరోసారి థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఆచార్య సినిమాను నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను ఇలాంటి సమయంలో విడుదల చేసి పాడు చేయడం దర్శక నిర్మాతలకు ఇష్టం లేదని.. అందుకే పరిస్థితులు కాస్త చక్కబడిన తరువాత ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వాళ్లు ఆలోచిస్తున్నారు.

క‌రోనా ఎఫెక్ట్ : ఆచార్య సినిమా రిలీజ్‌ వాయిదా ..?

ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆచార్య సినిమా జూన్ 18న విడుదల కానుంది. ఇదే గనుక నిజమైతే అఖిల్ కు టెన్షన్ తప్పదు. ఎందుకంటే ఈయన నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జూన్ 19న విడుదల కానుంది. ఏకంగా చిరంజీవితో పోటీ అంటే అంత చిన్న విషయం కాదు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో మాత్రమే వస్తున్న వార్తలు. మరి దీనిపై ఆచార్య యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

సాయంత్రం ఎన్టీఆర్ 30వ సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్

జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొద‌లెట్టేశాడు..!

క‌రోనా పాజిటివ్.. థియేట‌ర్‌లో ప్ర‌త్య‌క్షం అయిన హీరోయిన్

గుడ్ న్యూస్ చెప్పిన యాంక‌ర్ స‌మీరా షరీఫ్

ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఖిలాడి టీజ‌ర్

కేటీఆర్‌ సర్‌.. మీరు బాలీవుడ్‌, హాలీవుడ్ సినిమాల్లో ప్ర‌యత్నించ‌లేదా?

16 ఏళ్ల త‌ర్వాత బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌నున్న లెజండ‌రీ స్టార్స్

హీరోయిన్‌పై నెమ‌లి దాడి.. వీడియో వైర‌ల్

రామ్‌చరణ్‌ చిత్రంలో సల్మాన్‌?

ప‌వ‌ర్ స్టార్‌కు పెద్ద షాక్ ఇచ్చిన యువర‌త్న

దక్షిణాది అవకాశాలువస్తున్నాయి!

అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే..

ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సైడ్ బిజినెస్ అదిరింది

చిరంజీవి లూసీఫర్ రీమేక్ కు అదిరిపోయే టైటిల్

టాలీవుడ్‌కు క‌ష్ట‌మే : తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ థియేట‌ర్ల బంద్ ?‌

వకీల్ సాబ్ సినిమాలో పవన్ తెలంగాణ యాసకు కారణం ఇదే..

Advertisement
క‌రోనా ఎఫెక్ట్ : ఆచార్య సినిమా రిలీజ్‌ వాయిదా ..?

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement