Delimitation Bill | మారిన రాజకీయాలపై మోదీ సర్కార్ ఆశలు.. మళ్లీ డీలిమిటేషన్ బిల్లు?
Delimitation Bill | నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో ప్రయత్నం చేసే అవకాశంపై కొత్త రాజకీయ చర్చలు తెరపైకి వచ్చాయి.
Delimitation Bill | న్యూఢిల్లీ, జూన్ 2: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో ప్రయత్నం చేసే అవకాశంపై కొత్త రాజకీయ చర్చలు తెరపైకి వచ్చాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎన్నికల విజయాల నేపథ్యంలో ఈ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసే అవకాశాన్ని కేంద్రం మరోసారి అన్వేషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బిల్లును పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ బిల్లు, ఒక దేశం, ఒక ఎన్నిక బిల్లు రెండింటికీ పార్లమెంటరీ ఆమోదం పొందాలని ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపచేయడానికి ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నానికి పార్లమెంట్లో అవసరమైన మద్దతు లభించకపోవడంతో ఈ అంశం మళ్లీ వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు ఎలా?
ఇటీవల పలు రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారిపోయాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్-డీఎంకే కూటమి విచ్ఛిన్నమైందన్న వార్తలు చర్చనీయాంశంగా ఉన్న కీలక పరిణామాల్లో ఒకటి. బిల్లుకు విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం డీఎంకేను సంప్రదించే ప్రయత్నాలను ప్రారంభించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్‌లోని పరిణామాలను కూడా నిశితంగా గమనిస్తున్నారు. ఒకవేళ గణనీయ సంఖ్యలో ఎంపీలు టీఎంసీ నుంచి విడిపోతే అది పార్లమెంటరీ సమీకరణాలను మార్చివేసి బిల్లు ఆమోదానికి అవసరమైన మద్దతును కూడగట్టడంలో ప్రభుత్వానికి సులభతరం చేస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
గతంలో ఏం జరిగింది?
పోయినసారి డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు దాని ఆమోదం పొందేందుకు ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమైంది. అంటే బిల్లుకు అనుకూలంగా కనీసం 362 ఓట్లు అవసరం. అయితే బిల్లుకు 298 మంది సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. ఫలితంగా బిల్లుకు అవసరమైన సంఖ్యాబలం దక్కక సభలో వీగిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

