మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 13:34:39

ద‌స‌రా గిఫ్ట్‌.. మేక‌ప్‌మెన్‌కు కారు బ‌హుమ‌తి

ద‌స‌రా గిఫ్ట్‌.. మేక‌ప్‌మెన్‌కు కారు బ‌హుమ‌తి

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ద‌స‌రా సంద‌ర్భంగా  ప‌ర్స‌న‌ల్ మేక‌ప్‌మెన్‌కు కారుని బ‌హుమ‌తిగా ఇచ్చింది. అంతేకాదు కారు కీస్ అత‌ని చేతికి ఇస్తూ ద‌గ్గ‌రుండి పూజ‌లు కూడా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌డంతో జాక్వెలిన్ దాతృత్వంపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

వీడియాలో జాక్వెలిన్ ట్రాఫిక్ పోలీస్ గెట‌ప్‌లో క‌నిపిస్తుంది. సెట్స్‌లో ఉన్న‌ప్పుడే త‌న మేక‌ప్‌మెన్‌కు స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌డంతో అంద‌రు ఆమెని అభినందించారు. కాగా, లాక్‌డౌన్ స‌మ‌యంలో స‌ల్మాన్ ఫాం హౌజ్‌లోనే ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ ల‌లో పాల్గొంటుంది. సెట్స్‌లో దిగిన ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంది. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో త‌న ఫాలోవ‌ర్స్  సంఖ్య 46 మిలియ‌న్స్  మార్క్ చేరింద‌ని జాక్వెలిన్  సంతోషంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.