ఈ లక్షణాలు ఉంటే బ్లాక్ ఫంగస్

న్యూఢిల్లీ, మే 9: కరోనా నుంచి కోలుకొన్న, చికిత్స పొందుతున్న వారిపై బ్లాక్ ఫంగస్ దాడి(మ్యూకోర్మైకోసిస్) నేపథ్యంలో కేంద్రం పలు సూచనలు చేసింది. కొవిడ్ రోగుల్లో ‘కంటి చూపు మందగించడం, ముఖం ఒకవైపు భాగం నొప్పిగా ఉండటం, పంటి నొప్పి, ఛాతిలో నొప్పి, ఊపిరి సమస్యలు కనిపిస్తే బ్లాక్ ఫంగస్ సోకినట్టు అనుమానించాలని అని అడ్వైజరీలో సూచించింది. ఈ ఫంగస్ గాలిలో ఉంటుందని, పీల్చుకొన్నప్పుడు శరీరంలో చేరి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిలో వృద్ధి చెంది ప్రమాదకరంగా మారుతుందని పేర్కొన్నది.
లక్షణాలు
కండ్లు, ముక్కు చుట్టూ ఎర్రబడటం, నొప్పి, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరిసమస్యలు, వాంతిలో రక్తం రావడం.
ఎవరికి ప్రమాదం?
నియంత్రణ లేని మధుమేహం ఉన్నవారు, స్టెరాయిడ్ల వల్ల ఇమ్యూనిటీ కోల్పోయినవారు, ఐసీయూలో దీర్ఘకాలంగా చికిత్సపొందుతున్నవారు, అవయవమార్పిడి చికిత్స చేసుకొన్నవారు.
ఏం చేయాలి?
రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా చూసుకోవాలి. స్టెరాయిడ్లను సరైన సమయంలో సరైన మోతాదులో వేసుకోవాలి. యాంటీ బయాటిక్స్/యాంటీ ఫంగల్ ఔషధాలను సరైన సమయంలో సరైన మోతాదులో వేసుకోవాలి.
ఏం చేయకూడదు?
మ్యూకోర్మైకోసిస్ లక్షణాలను అలక్ష్యం చేయవద్దు. కొవిడ్ రోగుల్లో ముక్కు దిబ్బడ ఉంటే బాక్టీరియా ఇన్ఫెక్షన్ అనుకోవద్దు. వెంటనే పరీక్షలు చేసుకోవాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Black Fungus
- Coronavirus
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

