న్యూఢిల్లీ : ఆటోమొబైల్ కంపెనీలు జూలై 2021 అమ్మకాల గణాంకాలను విడుదల చేశాయి. ఈ గణాంకాల ప్రకారం జూలై నెలలో ఫోర్ వీలర్స్ అమ్మకాలు (Vehicle sales) కొంత వరకు పెరిగాయి. మారుతి 1.62 లక్షల వాహనాలు అమ్మగా.. టాటా మోటార్స్ 52 వేల వాహనాలను విక్రయించింది. హోండా కార్లు దేశీయ అమ్మకాలలో 12 సంవత్సరాల రికార్డును అధిగమించాయి. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సంవత్సరానికి 50.33 శాతం ఎక్కువ వాహనాలను విక్రయించింది. అలాగే, టాటా మోటార్స్ అమ్మకాలు కూడా గత నెలతో పోలిస్తే 19 శాతం పెరిగాయి.
ఆటో కంపెనీలు జూలై నెలలో మొత్తం 1,62,462 వాహనాలను విక్రయించగా.. వీటిలో 1,36,500 వాహనాలు భారతదేశంలో విక్రయించారు. 21,224 వాహనాలు ఎగుమతి చేశారు. 4,738 వాహనాలు ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారుల (ఓఈఎం) నుంచి వచ్చినవి. జూలై 2020 తో పోలిస్తే కంపెనీ మొత్తం వాహన విక్రయాలు 50.33 శాతం ఎక్కువ. 2020 జూలైలో మారుతి మొత్తం 1,08,064 వాహనాలు అమ్మింది.
జూన్ నెలతో పోలిస్తే జూలైలో టాటా మోటార్స్ 19 శాతం ఎక్కువ వాహనాలను విక్రయించింది. జూన్‌తో పోలిస్తే కంపెనీ ప్యాసింజర్ వాహన విభాగం 25 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ మొత్తం దేశీయ అమ్మకాలు 11 శాతం పెరిగాయి. జూలైలో కంపెనీ 21,796 వాహనాలను విక్రయించింది. ఇదే సమయంలో, మొత్తం వాణిజ్య వాహనాల అమ్మకాలు జూన్‌లో విక్రయించిన 22,100 యూనిట్లతో పోలిస్తే 23,848 యూనిట్లకు పెరిగాయి.
నిస్సాన్ కంపెనీ వాహనాల దేశీయ అమ్మకాలు జూలైలో 784 విక్రయమయ్యాయి. ఇది 2021 జూలైలో 4,259 కి పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో 2,375 వాహనాలను ఎగుమతి చేయగా, ఈ జూలైలో కంపెనీ 3,897 వాహనాలను ఎగుమతి చేసింది. ఇక హోండా కంపెనీ కార్లు 12 ఏండ్లలో అత్యధిక దేశీయ అమ్మకాలు జరిగింది. హోండా కార్ ఇండియా లిమిటెడ్ దేశీయ మార్కెట్లో 6,055 వాహనాలను విక్రయించడం ద్వారా జూలైలో 12 ఏండ్ల రికార్డును అధిగమించింది. గత ఏడాది జూలైలో కంపెనీ 5,383 యూనిట్ల వాహనాలను విక్రయించగా.. ఈ జూలైలో 918 వాహనాలను ఎగుమతి చేసింది.
ఇక రాయితో కొట్టారో.. కఠిన చర్యలు తప్పవు!
సరిహద్దు కమాండ్‌గా తొలిసారి మహిళా ఐపీఎస్
కేపీఎల్ ఆడావో.. ఇండియా రానివ్వమన్నారు: హెర్షలీ గిబ్స్
మృత్యువు నుంచి బయటపడటం అంటే ఇదే..!
అశ్వగంధ ఔషధంపై బ్రిటన్ పరిశోధన
టోక్యో ఒలింపిక్స్‌లో రాణులదే హవా..!
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?
ప్రపంచ అతిపెద్ద గేమింగ్ కంపెనీపై లైంగిక వేధింపుల కేసు
చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్ కనిపెట్టిన ప్రీస్ట్లీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..