Kashmir Premier League : కేపీఎల్ ఆడావో.. ఇండియా రానివ్వమన్నారు: హెర్షలీ గిబ్స్
Kashmir Premier League : పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తున్న కశ్మీర్ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) లో ఆడకూడదంటూ బీసీసీఐ తనకు వార్నింగ్ ఇచ్చిందని ఆరోపించారు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షలీ గిబ్స్. ఒకవేళ తమ మాట పెడచెవిన పెట్టి కేపీఎల్‌లో ఆడావో..

జోహన్నెస్‌బర్గ్ : పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తున్న కశ్మీర్ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) లో ఆడకూడదంటూ బీసీసీఐ తనకు వార్నింగ్ ఇచ్చిందని ఆరోపించారు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షలీ గిబ్స్. ఒకవేళ తమ మాట పెడచెవిన పెట్టి కేపీఎల్‌లో (Kashmir Premier League) ఆడావో.. ఇక భారతదేశంలోకి రానివ్వమని, నిషేధం విధిస్తామని బీసీసీఐ పెద్దలు తెగేసి చెప్పారని గిబ్స్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ విధంగా కేపీఎల్‌లో ఆడకుండా తనపై ఒత్తిడి తెస్తున్నారని గిబ్స్ ఆరోపించారు.
పాకిస్తాన్ తన రాజకీయ ఎజెండాలో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లో టీ 20 లీగ్ నిర్వహిస్తున్నది. ఈ లీగ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చాలా మంది విదేశీ ఆటగాళ్లతో ఒప్పందం చేసుకున్నది. అయితే, చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఇప్పుడు ఈ లీగ్ నుంచి వైదొలుగుతున్నారు. దీనికి బీసీసీఐ ఒత్తిళ్లే కారణమంటూ హెర్షలే గిబ్స్ బాంబు పేల్చారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కూడా ఇదే వాదన చేశారు.
గిబ్స్ ప్రకారం, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో జరిగే టీ 20 లీగ్‌లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లు భవిష్యత్‌లో భారతదేశంలో క్రికెట్‌కు సంబంధించిన ఏ కాంట్రాక్టు పొందలేరని బీసీసీఐ చెప్పింది. ఈ సందేశాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధిపతి గ్రేమ్ స్మిత్‌కు పంపినట్లు గిబ్స్ చెప్పుకొచ్చారు.
గిబ్స్ ఆరోపణల అనంతరం భారతదేశ వైఖరిపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత క్రికెట్ బోర్డు ఒత్తిడి ఉన్నప్పటికీ గిబ్స్, శ్రీలంకకు చెందిన తిలరత్నే దిల్షాన్ ఖచ్చితంగా ఈ లీగ్‌లో ఆడతారని పీసీబీ పేర్కొన్నది. వీరే కాకుండా ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్‌తో పాటు మరికొందరు విదేశీ ఆటగాళ్లతో పాకిస్తాన్ బోర్డు సంతకం చేసింది. ఈ ఆటగాళ్లు ఈ లీగ్‌లో పాల్గొంటారా లేదా అనేది ఇంకా నిర్ణయించబడలేదు.
గిబ్స్ ఆరోపణలపై బీసీసీఐగానీ, భారత ప్రభుత్వం గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పీసీబీ తయారుచేసిన స్టేట్మెంట్ను గిబ్స్ మీడియాకు ఇచ్చినట్లుగా తోస్తున్నదని పలువురు క్రికెట్ పండితులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మృత్యువు నుంచి బయటపడటం అంటే ఇదే..!
అశ్వగంధ ఔషధంపై బ్రిటన్ పరిశోధన
టోక్యో ఒలింపిక్స్‌లో రాణులదే హవా..!
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?
ప్రపంచ అతిపెద్ద గేమింగ్ కంపెనీపై లైంగిక వేధింపుల కేసు
చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్ కనిపెట్టిన ప్రీస్ట్లీ
ఇవి తింటే డయాబెటీస్ రాదంటా..! అవేంటంటే..?
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

