e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News Millet consumption reduces diabetes risk : ఇవి తింటే డయాబెటీస్‌ రాదంటా..! అవేంటంటే..?

Millet consumption reduces diabetes risk : ఇవి తింటే డయాబెటీస్‌ రాదంటా..! అవేంటంటే..?

‘మిల్లెట్స్‌’ – చిరుధాన్యాలు.. ఆరోగ్యకరమైన ఆహారానికి పర్యాయపదంగా మారింది. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేవారిలో టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని, రక్తంలో చక్కెరల స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తుందని (Millet consumption reduces diabetes-2 risk) ఇటీవలి ఒక అధ్యయనం వెల్లడించింది. ఇక్రిశాట్‌లో స్మార్ట్ ఫుడ్ ఇనిషియేటివ్ నేతృత్వంలో అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల బృందం, మధుమేహంపై చిరుధాన్యాల ప్రభావాన్ని పరిశీలించింది. ఈ ఆహారాన్ని తీసుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయే శాతం చాలాకాలం పాటు ఉన్నదని నిర్ధారించారు.

రోజువారీ ఆహారంలో భాగంగా మిల్లెట్లను తీసుకునే మధుమేహం ఉన్నవారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 12-15 శాతం (ఉపవాసం, భోజనం తర్వాత) తగ్గుతాయని, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మధుమేహం రావడానికి ముందు స్థాయికి చేరుకున్నాయని అధ్యయనం వెల్లడించింది. ప్రీ-డయాబెటిక్ వ్యక్తులకు HbA1c (బ్లడ్ గ్లూకోజ్ బౌండ్ హిమోగ్లోబిన్) స్థాయిలు సగటున 17 శాతం తగ్గాయి. ఈ స్థాయిలు డయాబెటిక్ నుంచి సాధారణ స్థితికి చేరుకున్నాయి.

- Advertisement -

‘ఎ సిస్టమాటిక్ రివ్యూ అండ్‌ మెటా-అనాలిసిస్ ఆఫ్ పొటెన్షియల్ ఆఫ్ మిల్లెట్స్ ఫర్‌ మేనేజింగ్‌ అండ్‌ రెడ్యూసింగ్‌ ది రిస్క్ ఆఫ్ డెవలపింగ్‌ డయాబెటిస్ మెల్లిటస్” అనే శీర్షికతో అధ్యయనం ‘ఫ్రాంటియర్స్ ఇన్‌ న్యూట్రిషన్‌’ లో ప్రచురితమైంది. ఈ అధ్యయనాన్ని భారతదేశం, జపాన్, మలావి, యునైటెడ్ కింగ్‌డమ్‌తోపాటు 11 దేశాల్లో నిర్వహించారు. నాన్‌ డయాబెటిక్‌, ప్రీ డయాబెటిక్‌, డయాబెటిక్‌ అంశాల్లో వివిధ ఫలితాలపై మిల్లెట్ల ప్రభావంపై 80 అధ్యయనాలను పరిశోధకులు సేకరించారు. వీటిలో దాదాపు 1,000 మానవ విషయాలతో కూడిన మెటా-విశ్లేషణకు 65 మంది అర్హులుగా గుర్తించారు. ఈ సమీక్ష 2017 అక్టోబర్ నుంచి 2021 ఫిబ్రవరి వరకు జరిగింది.

మిల్లెట్స్‌లో తక్కువ జీఐ

మిల్లెట్స్ 52.7 యొక్క తక్కువ సగటు గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ), మిల్లింగ్ రైస్, రిఫైన్డ్ గోధుమలతో పోలిస్తే 30 శాతం తక్కువ జీఐని కలిగిఉన్నది. మొక్కజొన్నతో పోలిస్తే దాదాపు 14-37 జీఐ పాయింట్లు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలు కనుగొన్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఆహారం గురించి తెలియజేస్తుంది. ఉడకబెట్టడం, బేకింగ్ చేయడం, ఆవిరి పట్టడం తర్వాత కూడా చిరుధాన్యాల్లో బియ్యం, గోధుమ. మొక్కజొన్న కంటే తక్కువ జీఐ ఉన్నదని తేల్చారు.

అయితే, ఫలితాలను రాబట్టడానికి ప్రజలు ఎంతకాలం మిల్లెట్లను తినాలి? అనే ప్రశ్న ఉద్భవిస్తున్నది. ఫలితాలను చూడటానికి నిర్దిష్ట కాల వ్యవధిని పేర్కొనలేదని, ప్రజలు జంక్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్స్‌కి తిరిగి వెళ్తే ఫలితాలు ఇలాగే ఉండవు’ అని అధ్యయనం ప్రధాన రచయిత, ఇక్రిశాట్‌ సీనియర్ న్యూట్రిషన్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ అనిత సూచించారు. భారతదేశంలో 1990-2016 వరకు మధుమేహం చాలా ఎక్కువ వ్యాధి భారం కలిగించడానికి దోహదపడిందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్‌) డైరెక్టర్ డాక్టర్ హేమలత చెప్పారు.

‘వ్యవసాయంలో వైవిధ్యం అనేది వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులకు నష్టాన్ని తగ్గించే వ్యూహం. అయితే ఆన్-ప్లేట్ వైవిధ్యం మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. పోషకాహార లోపం, మానవ ఆరోగ్యం, సహజ వనరుల క్షీణత, వాతావరణ మార్పులకు సంబంధించిన సవాళ్లను తగ్గించే పరిష్కారంలో మిల్లెట్లు భాగం. బహుళ భాగస్వాములతో కూడిన ట్రాన్స్-డిసిప్లినరీ పరిశోధన స్థితిస్థాపకమైన, స్థిరమైన, పోషకమైన ఆహార వ్యవస్థలను సృష్టించడానికి అవసరం’ అని ఇక్రిశాట్‌ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూస్ పేర్కొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

కొడుకు ఫస్ట్‌ బర్త్‌డే.. విషెస్‌ చెప్పిన హార్దిక్‌, నటాషా

అమ్మకు ప్రేమతో.. తల్లితో అనుష్క శెట్టి

పద్మశ్రీ అవార్డుకు వైజాగ్‌ కళాకారుడు నామినేట్‌

వాట్సాప్‌పై కేసు పెట్టిన రష్యా.. ఎందుకంటే..?

45 నిమిషాలపాటు నియంత్రణ కోల్పోయిన ఐఎస్‌ఎస్‌

టర్కీ అడవిలో దావానలం.. 20 గ్రామాలు తరలింపు

వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు

చరిత్రలో ఈరోజు.. మొబైల్ ఫోన్లకు 26 ఏండ్లు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement