Russia opens case against WhatsApp : వాట్సాప్‌పై కేసు పెట్టిన రష్యా.. ఎందుకంటే..?
Russia opens case against WhatsApp : వాట్సాప్‌పై రష్యా కన్నెర్రజేసింది. తమ దేశ పర్సనల్ డాటా చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై వాట్సప్ సంస్థపై రష్యాలో కేసు నమోదైంది

మాస్కో : వాట్సాప్‌పై రష్యా కన్నెర్రజేసింది. తమ దేశ పర్సనల్ డాటా చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై వాట్సప్ సంస్థపై రష్యాలో కేసు (Russia opens case against WhatsApp) నమోదైంది. వ్యక్తిగత డాటా చట్టాన్ని ఉల్లంఘించిన నేరారోపణపై ఇటీవలనే గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్ కంపెనీకి రష్యా కోర్టు ఒకటి 3 మిలియన్ రూబుళ్లను జరిమానాగా విధించింది. ఇదే కారణాలతో ఫేస్బుక్, ట్విట్టర్‌పై కూడా పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
తమ దేశ వినియోగదారుల డాటాను ఇక్కడే నిలువ చేయడంలో వాట్సాప్ సంస్థ విఫలమైందని ఆరోపణలు వచ్చాయి. దాంతో వాట్సాప్ సంస్థపై రష్యా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిషేధించిన కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు, మాస్కోలో కార్యాలయాలు తెరువడానికి విదేశీ టెక్ సంస్థలను బలవంతం చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో వాట్సాప్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం నమోదు చేసిన కేసులో వాట్సాప్ సంస్థ దాదాపు 6 మిలియన్ రూబుల్స్ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్‌ఫ్యాక్స్ మీడియా సంస్థ తెలిపింది. అయితే, విచారణ తేదీలను కోర్టు ఇంకా నిర్ణయించలేదని కోర్టు పత్రాలను బట్టి తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి..
45 నిమిషాలపాటు నియంత్రణ కోల్పోయిన ఐఎస్ఎస్
టర్కీ అడవిలో దావానలం.. 20 గ్రామాలు తరలింపు
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
చరిత్రలో ఈరోజు.. మొబైల్ ఫోన్లకు 26 ఏండ్లు
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నుంచి ఒలింపిక్స్ మెడల్స్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

