Turkey’s Forest Fire | టర్కీ అడవిలో దావానలం.. 20 గ్రామాలు తరలింపు
Turkey's Forest Fire | టర్కీలోని ఓ అడవిలో కార్చిచ్చు రగిలింది. పెద్ద సంఖ్యలో చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 82 ఏండ్ల వృద్ధుడితోపాటు నలుగురు మరణించగా.. దాదాపు 60 మంది దవాఖానపాలయ్యారు.

అంకారా : టర్కీలోని ఓ అడవిలో కార్చిచ్చు (Turkey’s Forest Fire) రగిలింది. పెద్ద సంఖ్యలో చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 82 ఏండ్ల వృద్ధుడితోపాటు నలుగురు మరణించగా.. దాదాపు 60 మంది దవాఖానపాలయ్యారు. దాదాపు 20 గ్రామాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అకసేకి పట్టణం వద్ద మంటల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను రెస్క్యూ బృందాలు రక్షించాయి.
అంటాల్యా ప్రావిన్స్లోని అడవిలో బుధవారం రాత్రి మంటలు అంటుకున్నాయి. అయితే, మంటలను అదుపులోకి తీసుకురావడానికి చాలా సమయం పట్టడంతో పక్కనే ఉన్న గ్రామాలకు మంటలు పాకాయి. మరుసటి రోజున మరో పెద్ద అగ్నిప్రమాదం సంభవించడంతో అకసేకి జిల్లాను మంటలు ముంచెత్తాయి. దాంతో ఈ జిల్లాలోని దాదాపు 20 గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 36 ప్రాంతాల్లో మంటలు అంటుకోగా.. 17 ప్రాంతాల్లో మంటలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించడంతో రెస్క్యూ బృందాలకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా తయారైంది. మంటలకు గాలులు తోడవడంతో వందల మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. 35 విమానాలు, 457 వాహనాలు, 4,000 కుపైగా సిబ్బంది మంటలను ఆర్పేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. వీలైనంత త్వరగా మంటలను అదుపులోకి తీసుకొస్తామని అధికారులు చెప్తున్నారు. అగ్నికీలలు ఎగిసిపడుతుండటంతో సమీపంలోని రిసార్టులు, హోటళ్లను అధికారులు ఖాళీ చేయించారు. మంటల కారణంగా నలుగురు వ్యక్తులు చనిపోగా, 60 మంది గాయపడ్డారని వ్యవసాయ, అటవీ మంత్రి బెకిర్ పెక్డెమిర్లి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
చరిత్రలో ఈరోజు.. మొబైల్ ఫోన్లకు 26 ఏండ్లు
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం
ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నుంచి ఒలింపిక్స్ మెడల్స్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

