Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం విషమం.. ఆస్పత్రికి తరలింపు: ఇజ్రాయిల్ మీడియా
Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఇజ్రాయిలీ మీడియాలో దీనికి సంబంధించిన కథనం వెలుబడింది. ఇరాన్ వర్గాలను ఊటంకిస్తూ ఛానల్ 14 ఓ వార్తను ప్రసారం చేసింది.
జెరుసలాం: ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఇజ్రాయిలీ మీడియాలో దీనికి సంబంధించిన కథనం వెలుబడింది. ఇరాన్ వర్గాలను ఊటంకిస్తూ ఛానల్ 14 ఓ వార్తను ప్రసారం చేసింది. ఇరాన్ అధ్యక్షుడు మాసౌద్ పెజెష్కియాన్ ప్రభుత్వ వర్గాలు కూడా ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న ఉన్నత స్థాయి అధికారుల దగ్గర మొజ్తాబా ఖమేనీ సమాచారం ఉన్నట్లు తెలిసింది. మొజ్తాబా ఖమేనీ మరణ వార్తను త్వరలోనే విన్నా ఆశ్చర్యం లేదని జెరుసలాం పోస్టు తన కథనంలో పేర్కొన్నది.
ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడిలో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణం నేపథ్యంలో సుప్రీంనేతగా అలీ ఖమేనీ కుమారుడైన మొజ్తాబా ఖమేనీ విధులు నిర్వర్తించారు. కానీ అమెరికా-ఇజ్రాయిల్ దాడిలో మొజ్తాబా కూడా గాయపడినట్లు తెలిసింది. ఫిబ్రవరి 28వ తేదీ దాడి నుంచి ఇప్పటి వరకు మొజ్తాబా ఆచూకీ లేదు. అమెరికా దాడిలో మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన్ను గుర్తించడం కష్టమే అని కొన్ని వార్తలు అప్పట్లో వెలుబడ్డాయి.
రహస్య ప్రదేశంలో చికిత్స పొందుతున్న ఆయన.. ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే మొజ్తాబాతో నేరుగా మాట్లాడే అవకాశాలు చాలా తక్కువే అని అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

