మద్దూరు(ధూళిమిట్ట), సెప్టెంబర్ 27: సోషల్ సబ్జెక్ట్‌పై విద్యార్థులు మక్కువ పెంచుకునేలా ‘సోషల్వాలా’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందించారు సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సుద్దాల రంజిత్‌కుమార్. 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల కోసం ఆన్లైన్ టెస్టులు, వీడియో లెస్సెన్స్, మ్యాపింగ్ స్కిల్స్, స్టడీ మెటీరియల్స్, సబ్జెక్ట్‌కు సంబంధించిన గేమ్స్‌ను అందుబాటులో ఉంచినట్టు ఆయన తెలిపారు. విద్యార్థులకే గాక ఉపాధ్యాయులు, ఉద్యోగార్థులకు ఎంతో ఉపయుక్తమని తెలిపారు.
గూగుల్ క్రోమ్‌లోకి వెళ్లి సోషల్వాలా పేరుతో వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అవ్వొచ్చని వెల్లడించారు. ఈ నెల 23న జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ చేతుల మీదుగా ఈ సోషల్వాలా వెబ్‌సైట్‌ను ప్రారంభించామని తెలిపారు. వెబ్‌సైట్‌ను రూపొందించిన సుద్దాల రంజిత్‌కుమార్‌ను విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాటు తోటి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.