Sexual Harassment: ప్రపంచ అతిపెద్ద గేమింగ్ కంపెనీపై లైంగిక వేధింపుల కేసు
Sexual Harassment : అమెరికాకు చెందిన ఒక ప్రముఖ గేమింగ్ సంస్థపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. లింగ వివక్ష, వేధింపుల ఆరోపణలలో ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో గేమ్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్ కంపెనీ చిక్కుకున్నది

న్యూయార్క్ : అమెరికాకు చెందిన ఒక ప్రముఖ గేమింగ్ సంస్థపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. లింగ వివక్ష, వేధింపుల ఆరోపణలలో ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో గేమ్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్ కంపెనీ (Sexual Harassment) చిక్కుకున్నది. జీతం, ప్రమోషన్లలో వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్నది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గత నెల 20న కేసు నమోదైంది. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా వాతావరణాన్ని సంస్థ తన కార్యాలయంలో అనుమతించిందని పిటిషన్‌దారు ఆరోపించారు. జీతం, ప్రమోషన్ నిర్ణయాల్లో కూడా పక్షపాతం వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాజ్యం అనేక ప్రముఖ వీడియో గేమ్ స్టూడియోల్లో ఇదే విధమైన పని సంస్కృతిని హైలైట్ చేస్తున్నది.
యాక్టివిజన్ కంపెనీ స్వయంగా వరల్డ్ ఆఫ్ వార్ క్రాఫ్ట్, ఓవర్వాచ్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ప్రసిద్ధ గేమ్‌లను సృష్టించింది. 2016 లో కాండీ క్రష్ మరింత వీక్షకులను పొందింది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 43.50 మిలియన్ క్రియాశీల వినియోగదారులు ఉన్నారు. 2021 మొదటి త్రైమాసికంలో దీని ఆదాయం దాదాపు రూ.15 వేల కోట్లు. కాలిఫోర్నియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెయిర్ ఎంప్లాయ్మెంట్ అండ్ హౌసింగ్ (డీఎఫ్ఈహెచ్) రెండేండ్ల పాటు విచారణ జరిపిన తర్వాత ఈ దావా వేసింది. వీరి దర్యాప్తులో జీతం, ప్రమోషన్లలో మహిళల పట్ల వివక్ష ఉన్నట్లు తేలింది. మహిళలు తక్కువ జీతాలకే పురుష ఉద్యోగుల కంటే ఎక్కువగా పని చేయాల్సి ఉంటుందని గుర్తించింది. ఈ కంపెనీ మానవ వనరుల విభాగం మహిళల ఫిర్యాదులను తీసుకోకుండా.. అక్కడి వ్యవహారాలను గోప్యంగా ఉంచుతుందని దావాలో పేర్కొన్నారు. ఎవరైనా విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై బదిలీ వంటి చర్యలు తీసుకుంటున్నారని దావాలో వెల్లడించారు.
వీడియో గేమ్ పరిశ్రమలో ఉద్యోగుల దోపిడీ ఆరోపణలు కొత్తేమీ కాదు. 2019 లో రియట్ గేమ్స్ ఉద్యోగులు లైంగిక వేధింపుల ఆరోపణలపై విధుల్ని బహిష్కరించారు. కాలిఫోర్నియాలో దావా వేయడంతో కంపెనీ మహిళా ఉద్యోగులకు రూ.74 కోట్లు చెల్లించింది. గత ఏడాది మరొక పెద్ద కంపెనీ ఉబిసాఫ్ట్ కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నది. 2019 లో వార్నర్ బ్రదర్స్ ఇంటరాక్టివ్ నెదర్లాండ్స్ రియల్మ్ స్టూడియోలో విషపూరిత పని సంస్కృతిని కూడా పెంచినట్లు ఆరోపణలు వచ్చాయి. గేర్‌బాక్స్ సీఈఓ తప్పుగా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 2018 లో క్వాంటిక్ డ్రీమ్ స్టూడియోస్ అధినేత జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడినట్లు కేసు నమోదైంది.
ఇవి కూడా చదవండి..
చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్ కనిపెట్టిన ప్రీస్ట్లీ
ఇవి తింటే డయాబెటీస్ రాదంటా..! అవేంటంటే..?
పద్మశ్రీ అవార్డుకు వైజాగ్ కళాకారుడు నామినేట్
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

