Ashwagandha Medicine : అశ్వగంధ ఔషధంపై బ్రిటన్ పరిశోధన
Ashwagandha Medicine : రోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆయుర్వేద ఔషధాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వీటిలో ముఖ్యంగా పోస్ట్, లాంగ్ కొవిడ్ రోగులు అశ్వగంధ నుంచి తయారుచేసిన ఔషధం ద్వారా ఎంతో ప్రయోజనం పొందారు. ఈ ఔషధం ప్రయోజనాలు భారతదేశంలోని వివిధ అధ్యయనాల ద్వారా నిరూపితమైంది

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆయుర్వేద ఔషధాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వీటిలో ముఖ్యంగా పోస్ట్, లాంగ్ కొవిడ్ రోగులు అశ్వగంధ నుంచి తయారుచేసిన ఔషధం ద్వారా ఎంతో ప్రయోజనం పొందారు. ఈ ఔషధం ప్రయోజనాలు భారతదేశంలోని వివిధ అధ్యయనాల ద్వారా నిరూపితమైంది. మన దేశంలో విజయం సాధించిన తర్వాత ఇప్పుడు తొలిసారిగా దేశం వెలుపల కొవిడ్ రోగులకు అశ్వగంధ ఔషధం (Ashwagandha Medicine) ఇచ్చి అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం భారతదేశం-బ్రిటన్ మధ్య ఒప్పందం కుదిరింది.
16 నెలల పాటు దాదాపు 100 సార్లు సమావేశమైన తర్వాత, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ), లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్.. మూడు బ్రిటన్ నగరాల్లో పోస్ట్ కొవిడ్ రోగులపై ఈ ఔషధాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించాయి.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లీసెస్టర్, బర్మింగ్‌హామ్, లండన్ నగరాల్లోని రెండువేల మంది పోస్ట్, లాంగ్ కొవిడ్ రోగులపై అధ్యయనం జరుగుతుందని ఏఐఐఏ డైరెక్టర్, ప్రాజెక్ట్‌కో-ఇన్వెస్టిగేటర్ డాక్టర్ తనూజ మనోజ్ నేసరి తెలిపారు. ప్రతి వేయి మందితో రెండు గ్రూపులను తయారు చేయడం ద్వారా ఈ అధ్యయనం జరుపనున్నారు. అనంతరం రెండు గ్రూపుల తులనాత్మక అధ్యయనం చేపట్టి ఫలితాను విశ్లేషిస్తారు. ఇటీవల భారతదేశంలో మానవుల్లో అనేక పరీక్షల్లో అశ్వగంధ ప్రభావవంతంగా ఉన్నదని ఎత్తి చూపారని డాక్టర్ తనూజ నేసరి పేర్కొన్నారు. కొవిడ్-19 దీర్ఘకాలిక లక్షణాలను తగ్గించడానికి అశ్వగంధ సరైన చికిత్సా ఎంపిక అని ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు నిరూపించాయి.
ఇవి కూడా చదవండి..
టోక్యో ఒలింపిక్స్‌లో రాణులదే హవా..!
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?
ప్రపంచ అతిపెద్ద గేమింగ్ కంపెనీపై లైంగిక వేధింపుల కేసు
చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్ కనిపెట్టిన ప్రీస్ట్లీ
ఇవి తింటే డయాబెటీస్ రాదంటా..! అవేంటంటే..?
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

