JOBS TSUNAMI| కొలువుల సునామీ.. ఏ రంగంలో తెలుసా..?!
JOBS TSUNAMI| కరోనాతో పలు రంగాలు కుదేలయ్యాయి.. భారీగా ఉద్యోగాల్లో కోత విధించారు. కానీ ఫ్రెషర్స్‌కు వచ్చే ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు లభించ......

న్యూఢిల్లీ: మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారితో వట్టిపోని రంగమే లేదు. ఫ్యాక్టరీలు.. సంస్థలు దెబ్బతిని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కానీ వచ్చే ఏడాది కాలంలో ఉద్యోగాల సునామీ నిరుద్యోగులను చుట్టుముట్టనున్నది. ఒకటి కాదు రెండు కాదు..లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఫ్రెషర్ల తలుపు తట్టనున్నాయి.
విశ్వమారి విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ వర్క్ ఫ్రం హోం, లెర్నింగ్ ఫ్రం హోంకు పరిమితం అయ్యారు. ఐటీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోం సేవలే అందిస్తున్నారు. అంతేకాదు.. ఈ సేవల కోసం సరికొత్త యాప్స్, సర్వీసులు ముందుకు వచ్చాయి.
ఐటీ దిగ్గజాల లాభాలు ఇలా
తత్ఫలితంగా ఈ ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశంలోని మూడు ఐటీ దిగ్గజాలు (టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో) రూ.17,446 కోట్ల లాభాలు గడించాయి. దాంతోపాటు వచ్చే మార్చి లోపు కొత్త ఇంజినీర్లకు 1.05 లక్షల కొలువులు ఇస్తామని వాగ్దానం చేశాయి.
విప్రో, ఇన్ఫీలకు పదేండ్లలో గరిష్ఠ లాభాలు
విప్రో, ఇన్ఫోసిస్‌లు గత పదేండ్లలో తొలిసారి గరిష్ఠ లాభాలు గడించాయి. విప్రో రూ.3,243 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 5,195 కోట్ల లాభాలు పొందాయి. ఇది దశాబ్దిలోనే అత్యధిక లాభాలు గడించిన తొలి త్రైమాసికం అని ఇన్ఫి సీఈవో సలీల్ పరేఖ్ అన్నారు. ఇక మరో దిగ్గజం టీసీఎస్ రూ.9000 కోట్ల లాభాలు పొందింది.
వర్క్ ఫ్రం హోం కల్చర్‌తో ఐటీ బిజినెస్ ఇలా
వర్క్ ఫ్రం హోం కల్చర్.. ఐటీ సంస్థలకు గొప్ప అవకాశాలు కల్పించింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ రంగంలో ఐటీ సంస్థల బిజినెస్ వృద్ధి సాధించింది. కంపెనీలు మంచి డీల్స్ పొందాయి.
ఇన్ఫోసిస్ రూ.19,381 కోట్లు, టీసీఎస్ రూ.60,381 కోట్లు, విప్రో రూ.5,325 కోట్లతో 8 న్యూ డీల్స్ గెలుచుకున్నాయి.
ఐటీ రంగ గ్రోత్‌కు ఈ రంగాలు కీలకం
డేటా అనలిటిక్స్, క్లౌడ్, కస్టమర్ ఎక్స్పీరియన్స్, సైబర్ విభాగాలు మున్ముందు ఐటీ రంగ పురోభివృద్ధికి కీలక డ్రైవర్లుగా ఉండనున్నాయని రిలయన్స్ సెక్యూరిటీస్ అనలిస్ట్ సుయోగ్ కులకర్ణి వ్యాఖ్యానించారు. ఐటీ రంగంలో యూరప్‌లో కన్సల్టెన్సీ విస్తరణ, ఇంజినీరింగ్‌లో ఆర్&డీ, ఔట్ సోర్సింగ్ షేర్ పెరుగుతున్నది.
ఇవి కూడా చదవండి:
భగ్గుమన్న బంగారం : ఎంసీఎక్స్‌లో పసిడి ధరలు పైపైకి!
సమ్మిళిత ఆర్థిక వృద్ధితోనే అసమానతలకు చెక్ : ఆర్బీఐ గవర్నర్
అదరగొట్టిన ఇన్ఫీ
మాస్టర్‌కార్డ్‌కు ఆర్బీఐ షాక్
పెట్రో షాక్ : వాహన విక్రయాలకు ఎదురుదెబ్బ
బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్‌గా భార్య.. అదే ఆఫీసులో భర్త స్వీపర్
కొంపముంచిన సెలబ్రెటీల ట్వీట్లు.. ఒక్కో పోస్టుతో వేల కోట్ల రూపాయలు ఆవిరి !
సోనూసూద్‌నే కొడుతావా.. టీవీ పగలగొట్టిన బుడ్డోడు
సొంతింటి కోసం హైదరాబాదీల పరుగులు.. గణనీయంగా పెరిగిన కొనుగోళ్లు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

