సోనూసూద్‌నే కొడుతావా.. టీవీ పగలగొట్టిన బుడ్డోడు
సోనూసూద్ | రీల్ లైఫ్‌లో విలన్‌గా నటించినప్పటికీ, రియల్ లైఫ్‌లో మాత్రం హీరోగా పేరు ప్రఖ్యాతులు గడించాడు. అలాంటి సోనూసూద్ పట్ల ఓ బుడ్డోడు అభిమానం

ప్రముఖ నటుడు సోనూసూద్ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నాడు. కరోనా కాలంలో ఎంతో మందిని ఆదుకుని ఆపద్భాందవుడిగా నిలిచాడు. రీల్ లైఫ్‌లో విలన్‌గా నటించినప్పటికీ, రియల్ లైఫ్‌లో మాత్రం హీరోగా పేరు ప్రఖ్యాతులు గడించాడు. అలాంటి సోనూసూద్ పట్ల ఓ బుడ్డోడు అభిమానం పెంచుకున్నాడు. ఓ సినిమాలో సోనూసూద్‌ను హీరో కొట్టడంతో.. తన అభిమాన నటుడిని కొడుతావా అంటూ కోపంతో ఊగిపోయి.. ఆ టీవీనే రాయితో పగులగొట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్లో చోటు చేసుకుంది. దీనిపై సోనూసూద్ తనదైన స్టైల్లో స్పందించారు.
న్యాల్కల్ గ్రామానికి చెందిన ఓ ఏడేళ్ల బాలుడు.. టీవీలో దూకుడు సినిమా చూస్తున్నాడు. ఈ సినిమాలో హీరో.. విలన్ సోనూసూద్‌తో ఫైట్ చేస్తూ కొడుతాడు. ఈ ఫైట్ ఆ బాలుడికి కోపం తెప్పించింది. కరోనా కాలంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన సోనూసూద్ సార్‌ను విలన్‌గా ఎందుకు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఫైట్‌ను తట్టుకోలేని ఆ బుడ్డోడు ఏకంగా టీవీని రాయితో పగులగొట్టాడు.
ఈ ఘటనను హరీష్ అనే నెటిజన్ సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై సోనూసూద్ తనదైన శైలిలో స్పందించారు. ‘అరేయ్.. మీ టీవీ పగలగొట్టకు.. మళ్లీ మీ నాన్న నన్ను కొత్త టీవీ కొనాలని అడుగుతాడు’ అంటూ సోనూసూద్ చమత్కారంగా ట్వీట్ చేశాడు.
Arrreee, Don't break your TVs,
— sonu sood (@SonuSood) July 14, 2021
His dad is going to ask me to buy a new one now 😆😆 https://t.co/HB8yM8h1KZ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Boy
- corona
- Nyalkal
- Sangareddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

